గవర్నమెంట్ ఉద్యోగులకి బంపర్ ఆఫర్

గవర్నమెంట్ ఉద్యోగులకి బంపర్ ఆఫర్

మీరు కేంద్రప్రభుత్వ ఉద్యోగులైతే చాలు.కారు లోన్ ఇస్తాం, అది కూడా 100% ఫైనాన్స్ తో అంటున్నాయ్ బ్యాంకులు. అదెలాగంటారా?!కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న సెవెన్త్ పేరివిజన్ కమిషన్ ప్రభుత్వ ఉద్యోగులకి మరో రూపంలోనూ కలిసి వస్తోంది. కార్ లోన్లు ఇస్తాం రా రమ్మంటూ బ్యాంకులు రకరకాల ఆఫర్లతో వారికి స్వాగతం పలుకుతున్నాయ్. మామూలుగా కార్ల కొనుగోలుకి రుణాలంటే డౌన్ పేమెంట్ కొంతతో పాటు..ప్రాసెసింగ్ ఛార్జీలు, డాక్యుమెంంటేషన్ ఛార్జీల పేరుతో బ్యాంకులు కొంత డబ్బు కస్టమర్ల దగ్గర వసూలు చేస్తుంటాయ్.

ఐతే ఇప్పుడు కొన్ని బ్యాంకులు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే చాలు..వందశాతం ఫైనాన్స్ కి కూడా సై అంటున్నాయ్. మొత్తం 48లక్షలమంది కేంద్ర ఉద్యోగులు..55లక్షలమంది పెన్షనర్లు ఉన్నారు. వీరిలో చాలామందికి పర్సనల్ లోన్, లేదంటే  కార్ లోన్ రూపంలో బ్యాంకులు ఆఫర్లు కురిపిస్తున్నాయ్

ఎస్బీఐ కేంద్రప్రభుత్వోద్యోగులకు వందశాతం ఆన్ రోడ్ ప్రైస్ పై ఫైనాన్స్ చేస్తుంది. గతంలో ఇది 90శాతంగా ఉఁడేది. ఇలాంటి రుణాలపై వడ్డీని 9.7శాతంగా ఎస్బీఐ వసూలు చేయనుంది. ఇందులో కూడా మహిళా ఉద్యోగి అయితే 9.65శాతమే వసూలు చేస్తామంటోంది.  ముందే అప్పు తీర్చినా వారిపై ఎలాంటి ఛార్జీలు లేవని ఎస్బీఐ ప్రకటించింది.HDFC బ్యాంక్ కూడా ఇదే రకమైన ఆఫర్ ని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీలకి ప్రకటించింది. కార్ల ఆన్ రోడ్ ధరపై 90శాతం లోన్ ఇవ్వనున్నట్లు చెప్పింది. గతంలో ఉన్న ప్రాసెసింగ్ ఫీజైన రూ.  2,885ల స్థానంలో ఫ్లాట్ ఫీజుగా రూ. 599 ప్రకటించింది. వడ్డీ రేటుగా 9.65శాతం నిర్ణయించింది. 

మరో ప్రవేట్ రంగ బ్యాంక్ యాక్సిస్ కూడా పూర్తి ఫైనాన్స్ కల్పించడంతో పాటుగా రీపేమెంట్ వ్యవధిని ఏడేళ్లనుంచి ఎనిమిదేళ్లకు పెంచింది. గతంలో తాను వసూలు చేసిన 10.25శాతాన్ని 9.97శాతానికి తగ్గించింది.బ్యాంకులతో పాటు..తమ సేల్స్ పెంచుకునేందుకు కంపెనీలు కూడా ఆఫర్లు ప్రకటిస్తున్నాయ్.హుండాయ్ గ్రాండ్ ఐటెన్, యాక్సెంట్ పై ఏడువేల రూపాయల తగ్గింపు, ఐటెన్, ఎవాన్ పై 5వేల రూపాయల తగ్గింపు ప్రకటించింది. టాటా మోటార్స్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలకి క్యాష్ డిస్కౌంట్లతో పాటు..వ్యారంటీ పీరియెడ్ ను పెంచింది. వీరిబాటలోనే హీరో మోటోకార్ప్, హోండాలు కూడా తమ టూ వీలర్స్ పై సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీలకు, పెన్షనర్లకు డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయ్ 
 Most Popular