బంగారం ధరలు ఎంత పెరిగిందో తెలుసా?

బంగారం ధరలు ఎంత పెరిగిందో తెలుసా?

లాభాల బాట పట్టిన పసిడి, వెండి
ఎంసీఎక్స్ లో 50,260 వద్ద ముగిసిన బంగారం
రూ. 62,260 వద్ద స్థిరపడిన వెండి

కరోనా సెకండ్ వేవ్ కారణంగా బంగారం, వెండిలాంటి లోహాలకు డిమాండ్ పెరిగింది. ఓవైపు డాలరు ఇండెక్స్ తో పాటు.. 10ఇయర్ ట్రెజరీ ఈల్డ్స్ బలపడినా పుత్తడికి మాత్రం  డిమాండ్ తగ్గలేదు. గత నాలుగు రోజులుగా తగ్గిన ధరలు శుక్రవారం యూ టర్న్ తీసుకున్నాయి. 
ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. 268 లాభపడి రూ. 50,260 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,435 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 49,857 వద్ద కనిష్టానికీ చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ సైతం రూ. 750 ఎగసి రూ. 62,260 వద్ద స్థిరపడింది. ముందుగా రూ. 62,750 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 61,560 వరకూ తగ్గింది. అటు అంతర్జాతీయ మార్కెట్లో శుక్రవారం బంగారం, వెండి ధరలు సానుకూలంగా ముగిశాయి. పసిడి ఔన్స్‌0.6 శాతం బలపడి 1,872 డాలర్ల వద్ద ఉంది. స్పాట్‌ మార్కెట్లోనూ 0.25 శాతం లాభంతో 1,871 డాలర్లకు చేరింది. వెండి 1.4 శాతం జంప్ చేసి ఔన్స్ 24.49 డాలర్ల వద్ద స్థిరపడింది.tv5awards