క్లోజింగ్‌ బెల్‌ : లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు

క్లోజింగ్‌ బెల్‌ : లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు

తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఇవాళ దేశీయ మార్కెట్లు ఎట్టకేలకు లాభాలతో ముగిశాయి. మిడ్‌సెషన్‌ తర్వాత లభించిన అనూహ్య కొనుగోళ్ళ మద్దతుతో దేశీయ సూచీలు అరశాతం పైగా లాభపడ్డాయి. ఇవాళ అన్ని రంగాల సూచీలు పాజిటివ్‌గా ముగిశాయి. ట్రేడింగ్‌ మొత్తం మీద సెన్సెక్స్‌ 282 పాయింట్ల లాభంతో 43882 వద్ద, నిఫ్టీ 72 పాయింట్ల లాభంతో 12843 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్‌, నిఫ్టీలు ఒకశాతం పైగా లాభపడ్డాయి.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐలు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా ఉన్నాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 9.27 శాతం, టైటాన్‌ 5.39 శాతం, గెయిల్‌ 4.22 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 3.98 శాతం, భారతీ ఎయిర్‌టెల్‌ 3.12 శాతం లాభంతో నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 3.66 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.47 శాతం, అదాని పోర్ట్స్‌ 1.56 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.15 శాతం, సన్‌ఫార్మా 0.97 శాతం నష్టంతో నిఫ్టీ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.tv5awards