విస్తరణ బాటలో ఎంఅండ్‌ఎం

విస్తరణ బాటలో ఎంఅండ్‌ఎం

రాబోయే కాలంలో తెలంగాణాలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టనున్నట్టు మహీంద్రా అండ్‌ మహీంద్రా ప్రకటించింది. తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తోన్న K2 సిరీస్‌ ట్రాక్టర్లను తెలంగాణాలోని జహీరాబాద్‌ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. 

దేశంలోనే అతిపెద్ద ట్రాక్టర్ల తయారీ ప్లాంట్‌ను తెలంగాణలోని జహీరాబాద్‌లో ఏర్పాటు చేసింది మహీంద్రా అండ్‌ మహీంద్రా. ఏటా లక్ష ట్రాక్టర్ల సామర్థ్యం ఉన్న ఈ ప్టాంట్‌తో ప్రపంచంలోనే అత్యధిక ట్రాక్టర్ల ఉత్పత్తి సంస్థగా ఎంఅండ్‌ఎం ఎంతో గుర్తింపు పొందింది. తాజాగా జపాన్‌కు చెందిన మిత్సుబిషితో కలిసి తక్కువ బరువు ఉండే K2 సిరీస్‌ ట్రాక్టర్లను తయారు చేస్తోంది.

విస్తరణలో భాగంగా జహీరాబాద్‌ ప్లాంట్‌లో K2 సిరీస్‌ ట్రాక్టర్లను ఉత్పత్తి చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ నిర్ణయంతో సుమారు 1500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వచ్చే నాలుగేళ్ళలో ఈ ట్రాక్టర్లు అందుబాటులోకి వస్తాయని, ఇందుకోసం రూ.100 కోట్లను ఇన్వెస్ట్‌ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. భారత్‌తో పాటు అమెరికా, జపాన్, ఆగ్నేయాసియా సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో K2 సిరీస్‌ ట్రాక్టర్లను విక్రయించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. 
 tv5awards