భారీగా పెరగనున్న మొబైల్‌ టారిఫ్‌లు

భారీగా పెరగనున్న మొబైల్‌ టారిఫ్‌లు

త్వరలోనే మొబైల్‌ టారిఫ్‌లు భారీగా పెరగనున్నాయి. నిర్వహణ ఛార్జీలు పెరగడంతో వచ్చే ఏడాది జనవరి నుంచి మొబైల్‌ టారిఫ్‌లు 15-20 శాతం పెరిగే ఛాన్స్‌ ఉంది. ప్రస్తుతం టెలికాం ఇండస్ట్రీలో అతి తక్కువ ఛార్జీలు ఉన్నాయని, ఇవి దీర్ఘకాలం పాట కొనసాగితే తాము భారీ నష్టాలను చవిచూడటం ఖాయమని వొడాఫోన్‌ అంచనా వేస్తోంది. మిగతా కంపెనీల కంటే ముందే తాము ఛార్జీలను పెంచేందుకు తాము వెనుకాడబోమని వొడాఫోన్‌ సంకేతాలిచ్చింది.

ఎయిర్‌టెల్‌ కూడా ఛార్జీల పెంపుపై సానుకూలంగా వ్యవహరించింది. అయితే మిగతా కంపెనీల కంటే ముందు ఛార్జీలను పెంచే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసింది. రిలయన్స్‌ జియో కూడా ఇదే దారిలో పయనించే ఛాన్స్‌ వుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 
 tv5awards