భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ ర్యాలీకి కారణమిదే..!

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ ర్యాలీకి కారణమిదే..!

గత రెండురోజులుగా భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ జోరుమీదుంది. మేనేజ్‌మెంట్‌ కామెంటరీతో ఈ స్టాక్‌ స్ట్రాంగ్‌గా ట్రేడవుతోంది. గత రెండు రోజుల్లో ఈ స్టాక్‌ 12 శాతం పైగా లాభపడింది. ఇవాళ ఇంట్రాడేలో షేర్‌ 6 శాతం పైగా లాభపడి డే గరిష్ట స్థాయి రూ.109.35కు చేరింది. 52 వారాల గరిష్టానికి ఈ స్టాక్‌ మరో 9 శాతం దూరంలో ఉంది. ప్రస్తుతం భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ 5శాతం లాభంతో రూ.108.15 వద్ద ట్రేడవుతోంది. 

ఇవాళ ఇప్పటివరకు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో కలిపి దాదాపు 1.94 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.25121.27 కోట్లకు చేరింది. ఇండస్ట్రీ పీ/ఈ 13.87 కాగా కంపెనీ పీ/ఈ 14.77గా ఉంది. బుక్‌ వేల్యూ రూ.40.44, ఈపీఎస్‌ రూ.6.98గా ఉన్నాయి.

ర్యాలీకి ఇదే కారణం..
కంపెనీ స్ట్రాంగ్‌ గైడెన్స్‌ ప్రకటించడంతో భారత్‌ ఎలక్ట్రానిక్స్‌కు భారీ కొనుగోళ్ళ మద్దతు లభిస్తోంది. మీడియం టర్మ్‌లో రెండంకెల వృద్ధి, స్థిరమైన మార్జిన్లు, మెరుగైన ఆర్డర్లు కంపెనీకి బూస్టింగ్‌ ఇవ్వనున్నట్టు భారతీ ఎలక్ట్రానిక్స్‌ అంచనా వేస్తోంది. దీంతో ఈ ఏడాది ఆగస్ట్ 14న నమోదైన 52 వారాల గరిష్టం రూ.118.45కు ప్రస్తుతం ఈ స్టాక్‌ చేరువలో ట్రేడవుతోంది. 
 tv5awards