14 శాతం ప్రీమియంతో లిస్టైన గ్లాండ్‌ ఫార్మా

14 శాతం ప్రీమియంతో లిస్టైన గ్లాండ్‌ ఫార్మా

హైదరాబాద్‌కు చెందిన ఔషధ తయారీ కంపెనీ గ్లాండ్‌ ఫార్మా ఇవాళ స్టాక్‌ మార్కెట్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇష్యూ ధరతో పోలిస్తే 14 శాతం ప్రీమియంతో రూ.1710 వద్ద ఎన్‌ఎస్‌ఈలో, 13.4 శాతం లాభంతో రూ.1701 వద్ద బీఎస్‌ఈలో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఇష్యూ ధర రూ.1500కాగా ఈ ఐపీఓకు క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల నుంచి చక్కని రెస్పాన్స్‌ లభించింది. 

ఈనెల 9న ప్రారంభమై 11న ముగిసిన ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.6480 కోట్ల నిధులను  సమీకరించింది. రూ.1250 కోట్ల తాజా ఈక్విటీ షేర్ల జారీతో పాటు 3.48 కోట్లకు పైగా షేర్లను ఆఫర్‌ ఫర్‌ పద్ధతిలో విక్రయించింది. యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.1943.86 కోట్లను సమీకరించింది. 
 tv5awards