గ్లాండ్ ఫార్మా గ్రాండ్ లిస్టింగ్...

గ్లాండ్ ఫార్మా గ్రాండ్ లిస్టింగ్...

ఇంజెక్టబుల్ ఫోకస్జ్ బిజినెస్‌లో అతి పెద్ద కంపెనీల్లో ఒకటి అయిన గ్లాండ్ ఫార్మా.. ఇవాళ స్టాక్ మార్కెట్లలో గ్రాండ్ లిస్టింగ్‌నే సొంతం చేసుకుందని చెప్పాలి. గత వారంలో పబ్లిక్ ఇష్యూకు వచ్చిన గ్లాండ్ ఫార్మా.. 2.06 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌ను దక్కించుకుంది.

రూ. 1500 ధరను తుది ఇష్యూ ధరగా నిర్ణయించగా.. ఈ స్టాక్ లిస్టింగ్‌లో మంచి ప్రైస్ నమోదు చేయవచ్చని ముందు నుంచే అంచనాలు ఏర్పడ్డాయి.

గ్రే మార్కెట్లో కూడా ఒక దశలో రూ. 10 వరకూ డిస్కౌంట్‌లో కనిపించిన గ్లాండ్ ఫార్మాకు.. ఆ తర్వాత ఊహించిన స్థాయిలోనే మద్దతు లభించింది. నిన్న కూడా రూ. 150 వరకూ గ్రే మార్కెట్ ప్రీమియం లభించగా.. ఇవాళ లిస్టింగ్ ఆరంభంలోనే దాదాపు రూ. 270 వరకూ... అంటే 18 శాతం మేర ప్రీమియం లిస్టింగ్ లభించడం విశేషం.


ఎన్ఎస్ఈలో 18 శాతం ప్రీమియంతో రూ. 276 పెరిగి.. రూ. 1776 వద్ద గ్లాండ్ ఫార్మా షేర్ లిస్టింగ్ కాగా.. ప్రస్తుతం ఎన్ఎస్‌ఈలో 20.67  శాతం లాభంతో రూ. 18.10 వద్ద షేర్ కదలాడుతోంది. tv5awards