మ్యూచువల్ నుంచి అవుట్.. నేరుగా మార్కెట్లోకి ఇన్

మ్యూచువల్ నుంచి అవుట్.. నేరుగా మార్కెట్లోకి ఇన్

మ్యూచువల్ నుంచి అవుట్.. నేరుగా మార్కెట్లోకి ఇన్
వరసగా ఐదో నెలలోనూ రిడంప్షన్ ఒత్తిడి
ఈక్విటీ ర్యాలీతో  మారుతున్న ట్రెండ్

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వరసగా 5వ నెలలోనూ అవుట్ ఫ్లో కొనసాగుతోంది. తాజా నివేదిక ప్రకారం అక్టోబర్ కూడా మ్యూచువల్ ఫండ్స్ నుంచి రూ.7300 కోట్లు రిడంప్షన్ కొనసాగించింది. గడిచిన 5 నెలల్లో మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ నుంచి  రూ.26600 కోట్లు విత్ డ్రా అయినట్టు జేఎమ్ ఫైనాన్సియల్ కంపెనీ చెబుతోంది. మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతున్న కూడా ఫండ్స్ అవుట్ ఫ్లో పెరగడం గమనించదగ్గ విషయం. 

కారణాలివేనా?
1. మ్యూచువల్ ఫండ్స్ నుంచి అవుట్ ఫ్లోస్ పెరగడానికి ప్రధానకారణాలు మూడునాలుగున్నాయి. ముఖ్యంగా ఇన్వెస్టర్లు నేరుగా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా మార్కెట్లో ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్ బుకింగ్ తీసుకోవాలనుకుంటున్నారు. మ్యూచువల్ ఫండ్స్ నుంచి డైరెక్ట్ మార్కెట్లోకి వెళుతున్నాయి.

2. మరో కారణం అమెరికా ఎన్నికలకు ముందు HNIలు అమెరికా ఎన్నికల రిజల్ట్ కు ముందు ప్రాఫిట్ బుకింగ్ తీసుకున్నారు. 

3. ఇక మల్టీ క్యాప్ ఫండ్ విషయంలో సెబీ నిబంధనలు కూడా కారణం. tv5awards