గోల్డ్ ETF వద్దు.. ఈక్విటీ ముద్దంటున్న ఇన్వెస్టర్లు

గోల్డ్ ETF వద్దు.. ఈక్విటీ ముద్దంటున్న ఇన్వెస్టర్లు

గోల్డ్ ETF వద్దు.. ఈక్విటీ ముద్దంటున్న ఇన్వెస్టర్లు
3 నెలలుగా తగ్గిన పెట్టుబడులు
ఖాతాల రిజిస్ట్రేషన్ లోనూ షార్ట్ ఫాల్
స్టాక్ మార్కెట్లలో లాభాలకు ఫండ్స్ మళ్లింపు

ఈక్విటీ మార్కెట్లు బేర్ మంటున్నా.. కరోనా లాంటి పేండమిక్ అనిశ్చితి వచ్చినా బంగారం లాంటి ఐడియా గోల్డ్ ఫ్యూచర్స్. రిటైల్ మరియు హై నెట్ వర్త్ ఇన్వెస్టర్లు కూడా భారీగా పెట్టుబడులు పెడుతుంటారు. ఇటీవల కరోనా కారణంగా స్టాక్ మార్కెట్లు మార్చిలో భారీగా పతనం అయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు భయంతో గోల్డ్ ETF వైపు మళ్లారు. పెట్టిన పెట్టుబడికి లాభాలు కూడా భారీగానే వచ్చాయి. గత ఏడాది గోల్డ్ ETFలో ఇన్వెస్టర్లకు 32శాతం ప్రాఫిట్ చూపించింది. గోల్డ్ etf మార్కెట్లోకి రికార్డు స్థాయిలో రూ.6244 కోట్ల ఇన్ ఫ్లోస్ కూడా వచ్చాయి. ఒక్క ఏడాదిలోనే అసెట్ అండర్ మేనేజ్ మెంట్ AUM కంపెనీల బిజినెస్ డబుల్ అయింది.

రివర్స్ గేర్...
పేండమిక్ కారణంగా గోల్డ్ ETFవైపు ఇన్వెస్టర్లు మళ్లారు. కానీ మళ్లీ 3 నెలలుగా పరిస్థితులు తిరగబడ్డాయి. అనూహ్యంగా ఇన్వెస్టిమెంట్లు తగ్గాయి. ఫిబ్రవరిలో రూ.1400 కోట్లకు పైగా పెట్టుబడులు వస్తే.. అక్టోబర్ లో  రూ.400 కోట్లకు పరిమితం అయింది.  ఆగస్టు వరకూ కూడా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. కానీ సెప్టంబర్ నుంచి తగ్గుముఖం పట్టినట్టు లేటెస్ట్ డేటా చెబుతోంది. 
 
న్యూ ఫోలియో రిజిస్ట్రేషన్ల పైనా ఎఫెక్ట్
పెట్టుబడులు తగ్గడంతో పాటు.. పోర్ట్ ఫోలియో రిజిస్ట్రేషన్లపైనా ఎఫెక్ట్ పడుతోంది. ఆగస్టు 2020 వరకూ నెలవారీగా కొత్తగా అకౌంట్లు భారీగా పెరిగాయి. నెలకు యావరేజ్ గా 5శాతం కంటే ఎక్కువే రిపోర్ట్ అయింది. కానీ ప్రస్తుతం ఇది 2శాతం మించడం లేదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. గోల్డ్ ETF మొత్తం ఖాతాలు అక్టోబర్ నాటికి 7.83 లక్షలు. గడిచిన ఏడాది దాదాపు 108శాతం పెరిగాయి. అంటే ఏస్థాయిలో పెరిగియో అర్ధం చేసుకోవచ్చు.  కానీ.. ఇప్పుడు అంత స్పీడు కనిపించడం లేదు.
 

ట్రేడెడ్ వాల్యూకూడా తగ్గింది
ఆగస్టులో గోల్డ్ ETF మార్కెట్లో ట్రేడ్ వాల్యూ ఏకంగా రూ.1686 కోట్లుగా ఉంది. కానీ సెప్టెంబర్ లో రూ.847 కోట్లు కాగా.. అక్టోబర్ లో రూ.501 కోట్లు మాత్రమే. అంటే 3 నెలలుగా ఇది తగ్గుతూ వస్తుంది. 

రెండు ప్రధాన కారణాలు...
పేండమిక్ కారణంగా ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి భయపడ్డారు. దీంతో సేఫ్ హెవెన్ అయిన గోల్డ్ ETFవైపు మళ్లారు. సహజంగానే బంగారం ధర పెరిగింది. లాభాలు కూడా భారీగా తెచ్చింది. అయితే అన్ లాక్ తర్వాత పరిస్థితులు మారాయి. ఎకానమీ గాడిలో పడింది. స్టాక్ మార్కెట్లలో ర్యాలీ కనిపించింది. మార్చిలో లోయర్ మార్కు నుంచి కోలుకుని ఆల్ టైం రికార్డు దిశగా నిఫ్టీ, సెన్సెక్స్ కదిలాడుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కోసం ఈక్విటీ మార్కెట్లకు తరలిపోతున్నారు. సహజంగానే గోల్డ్ ETF కు ఇన్ ఫ్లోస్ తగ్గాయి. దీంతో పాటు.. బంగారం ధరలు కూడా నిలకడగా ఉన్నాయి. ఆగస్టులో భారీగా పెరిగిన ధరలు ప్రస్తుతం స్టేబుల్ గా ఉంటాయని.. ఇంతకంటే ఎక్కువ పెరగకపోవచ్చన్న అభిప్రాయం కూడా ఇన్వెస్టర్లను ఆలోచింపజేసింది. ఇవన్నీ కూడా ETF నుంచి మార్కెట్ల వైపు మళ్లేలా చేసింది.tv5awards