లాభాల్లో ట్రేడవుతోన్న దేశీయ మార్కెట్లు

లాభాల్లో ట్రేడవుతోన్న దేశీయ మార్కెట్లు

నిన్న భారీ కరెక్షన్‌కు గురైన దేశీయ మార్కెట్లు ఇవాళ కోలుకున్నాయి. సెన్సెక్స్‌ 0.3 శాతం లాభంతో 43732 వద్ద, నిఫ్టీ 0.3శాతం లాభంతో 12813 వద్ద ఇవాల్టి ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నిఫ్టీ రియాల్టీ ఒక శాతం లాభంతో టాప్‌ పెర్ఫామర్‌గా ఉంది. నిఫ్టీ ఐటీ 0.8శాతం లాభంతో, నిఫ్టీ మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్‌లు అరశాతం చొప్పున లాభంతో ఉన్నాయి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌లో నిన్న వరుస ర్యాలీకి బ్రేక్‌ పడగా, ఇవాళ మళ్ళీ ఆ ఇండెక్స్‌లు కోలుకుని అరశాతం పైగా లాభంతో కొనసాగుతోన్నాయి.

ప్రస్తుతం సెన్సెక్స్‌ 259 పాయింట్ల లాభంతో 43859 వద్ద, నిఫ్టీ 76 పాయింట్ల లాభంతో 12847 వద్ద ట్రేడవుతోన్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా స్టీల్‌లు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా ఉన్నాయి. టాటా స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హిందాల్కో, బజాజ్‌ ఫైనాన్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 2-3.20 శాతం లాభంతో నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. యూపీఎల్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, గెయిల్‌, హెచ్‌యూఎల్‌, అదాని పోర్ట్స్‌లు 0.2-1శాతం నష్టంతో నిఫ్టీ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. 


 tv5awards