ఈ మాడు స్టాక్స్ సంగతేంటో చూస్తారా?

ఈ మాడు స్టాక్స్ సంగతేంటో చూస్తారా?

ఈ మాడు స్టాక్స్ సంగతేంటో చూస్తారా?

మార్కెట్లు వరుస లాభాల్లో ఉన్నాయి. గురువారం నష్టాలతో మొదలైన తర్వాత మళ్లీ ఇన్వెస్టర్లలో ఆందోళన కూడా స్టార్ట్ అయింది. మార్కెట్ ఎలా ఉన్నా.. కావాల్సింది ప్రాఫిట్ బుకింగ్. మరి 2, 3 వారాల్లో మంచి లాభాలే జేబులో వేసుకోవాలంటే మాత్రం ఈ స్టాక్స్ పై ఓ లుక్కేయండి.

ముత్తూట్ ఫైనాన్స్ స్టాక్ ప్రస్తుతం ఆల్ టైం హై రూ.1405 నుంచి కరెక్షన్ మోడ్ లో ఉంది. ప్రస్తుతం ఇది రూ.1169 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే రిస్క్ చేస్తే మంచి లాభాలు వస్తాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. రూ.1290 వరకూ టార్గెట్ పెట్టుకుని ట్రేడ్ చేయవచ్చు. అయితే స్టాప్ లాస్ మాత్రం 1115 వద్ద చూసుకోవాలి. 10శాతం వరకూ గెయిన్ అవ్వొచ్చు.

టెక్ మహీంద్రా కంపెనీ షేరు లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ 821 వద్ద ఉంది. సెల్లింగ్ ఆప్షన్ సూచిస్తోంది. గత కొంతకాలంగా ఆల్ టైం హై నుంచి ఇది డౌన్ సైడ్ నడుస్తోంది. 12శాతం వరకూ పడిపోయే అవకాశం ఉంది. టార్గెట్ 720 వరకూ పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ మాత్రం రూ.890.  

విగార్గ్ కంపెనీ మంచి పనితీరు కనపరుస్తోంది. కంపెనీ షేరు అప్ సైడ్ ఉంది. 19శాతం వరకూ రానున్న రెండు, మూడు వారాల్లో మెరుగుపడే అవకాశం ఉంది. ప్రస్తుతం ట్రేడింగ్ ప్రైస్ రూ.176గా ఉంది. టార్గెట్ రూ.210 పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ మాత్రం రూ.157 దగ్గర చూసుకోవాలి.  tv5awards