ఫుల్ జోష్ లో ఎయిర్ లైన్స్ ఈక్విటీ స్టాక్స్

ఫుల్ జోష్ లో ఎయిర్ లైన్స్ ఈక్విటీ స్టాక్స్

ఫుల్ జోష్ లో ఎయిర్ లైన్స్ ఈక్విటీ స్టాక్స్ 
నవంబర్ లో భారీగా పెరిగిన షేర్లు ఇవే 

నవంబర్ నెలలో స్పైస్ జెట్ లిమిటెడ్ షేర్లు దాదాపు 50% పెరగ్గా,  ఇండిగో 29% గెయిన్ అయింది. నవంబర్ 1 నుండి ఇప్పటి వరకు, స్పైస్ జెట్ 50.30%, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ 28.75% పెరిగింది.
కారణాలివే...
లాక్ డౌన్ తర్వాత మళ్లీ విమాన సంస్థల్లో సర్వీసులు మొదలయ్యాయి. క్రమంగా ప్రయాణీకులు పెరుగుతున్నారు. దీంతో సహజంగానే కంపెనీల ఆదాయం గణనీయంగా పెరిగింది. అక్టోబర్‌ నెలలో  5.27 మిలియన్ల మంది ప్రయాణికులను తీసుకెళ్లాయి. సెప్టెంబర్‌లో ఇది కేవలం 3.94 మిలియన్లు మాత్రమే.  మార్చి 2019 నుండి గ్రౌండ్ అయిన బోయింగ్ 737 మాక్స్ విమానాలు ఎగిరేందుకు US ఏవియేషన్ రెగ్యులేటర్ అయిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అనుమతించింది. అధిక ఇంధన ఆదా కావడంతో పాటు.. ఎక్కువమంది ప్రయాణీకులను తీసుకొచ్చేందుకు వర్కువుట్ అవుతుంది. దీంతో పాటు..ఊహించిన సమయం కంటే ముందే టీకాపై ఆశలు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. దీంతో అవకశాలున్న ఎయిర్ లైన్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి మదుపుదారులు ముందుకొస్తున్నాయి. 
రాబోయే మూడేళ్ళలో వృద్ధి , మార్కెట్ వాటా లాభాలు, స్థిరమైన నగదు ప్రవాహం ముడి ధరల తగ్గుదల అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు. మొత్తానికి చాలాకాలం తర్వాత ఎయిర్ లైన్స్ కంపెనీల్లో ఉత్సాహం కనిపిస్తుంది. అటు ఇన్వెస్టర్లలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.tv5awards