IPOకు 10 కంపెనీలు.. అమ్మకానికి మరికొన్ని సంస్థలు

IPOకు 10 కంపెనీలు.. అమ్మకానికి మరికొన్ని సంస్థలు

IPOకు 10 కంపెనీలు.. అమ్మకానికి మరికొన్ని సంస్థలు
పక్కా ప్లాన్ తో వస్తున్న మహీంద్రా
ఇన్వెస్టర్లకు తలుపులు తీస్తున్న కంపెనీ

మహీంద్రా అండ్ మహీంద్రా అంటే కంపెనీ. టాటా బిర్లాల తర్వాత అంత ఫేమస్. వాస్తవానికి అంబానీలు, అదానీల కంటే ముందుండాలి కానీ.. అలా జరగలేదు. అయినా కంపెనీ అనేక దేశాల్లో ఎన్నో వ్యాపారాలు చేస్తుంది. మొబిలిటీ, ఫైనాన్సియల్, రూరల్, నిర్మాణం, విద్య, టెక్నాలజీ ఇలా అన్ని రంగాల్లో విస్తరించింది. కంపెనీకి అధ్బుతమైన లాభాలు పంచే వజ్రాల్లాంటి కంపెనీలున్నాయి. వెనక్కు లాగే లాస్ మేకింగ్ సంస్థలు కూడా ఉన్నాయి. ఇంతకాలం ఒకటి.. ఇకమీదట జరగబోయేది మరో లెక్క అంటూ కంపెనీ సరికొత్త ప్రణాళికలతో వస్తోంది. ఇంతకీ ఏంటో చూసేద్దామా..

IPOకు పది కంపెనీలు
కంపెనీ పది కంపెనీలను గుర్తించింది. దశలవారీగా రానున్న పదేళ్లలో IPOకి తీసుకరావాలని నిర్ణయించింది. ఇందులో మహీంద్రా సుస్టేన్, మహీంద్రా పవరోల్, యాక్సిలో, బ్రిస్టల్ కోన్, జావా బైకుల తయారీ సంస్థ క్లాసిక్ లెజెండ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎలక్ట్రిక్ మొబిలిటి, ఫస్ట్ ఛాయిస్ సహా మొత్తం 10 కంపెనీలు జాబితాలో ఉన్నాయి.   ఇవన్నీ మొదటిసారి స్టాక్ మార్కెట్లో ఎంటర్ కానున్నాయి. రానున్న రెండు, మూడేళ్లలో 3 కంపెనీలు, 3 నుంచి 5ఏళ్లలో మరికొన్ని, 5 నుంచి 7ఏళ్లలో చివరిదశలో కంపెనీలు లిస్టింగ్ కు వస్తాయి. ఈ పది కంపెనీలు కలిపి గ్రూపునకు దాదాపు రూ.10వేల కోట్ల ఆదాయాన్ని తీసుకొస్తున్నాయి. చాలా కంపెనీలు మంచిపనితీరు కనపరుస్తున్నాయి. మాత్రుసంస్థ నుంచి నిధుల అవసరం లేకుండా సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నాయి. 

వాటిని వదిలించుకుంటాం...
మంచి కంపెనీలను లిస్టింగ్ తీసుకరావడంతో పాటు.. లాస్ మేకింగ్ కంపెనీలకు విక్రయించాలని కూడా నిర్ణయించింది మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్. ఇందులో భాగంగా SsangYong Motor Co., అమెరికాలోని స్టార్టప్ బైక్ కంపెనీ GenZe, ఆస్ల్రేలియాకు చెందిన స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ మేకర్ GippsAero Pty Ltd. వంటి కంపెనీలను విక్రయించాలని చూస్తోంది.

గ్రోత్ ఉన్న కంపెనీలకు లిక్విడిటీ సమస్య రాకుండా విస్తరణకు అనుకూలంగా మార్కెట్లోకి వస్తున్నట్టు కంపెనీ చెబుతోంది. అదే సమయంలో నగదు నిల్వలను హరిస్తున్న లాస్ మేకింగ్ కంపెనీలకు విక్రయించడానికి రెడీగా ఉన్నట్టుచెబుతోంది. మొత్తానికి పదేళ్ల సుదీర్ఘ ప్రణాళికతో కంపెనీ రెడీ అవుతోంది.



tv5awards