డీబీఎస్.. లక్ష్మీ విలాస్.. డీల్ సెట్ అవుతుందా?

డీబీఎస్.. లక్ష్మీ విలాస్.. డీల్ సెట్ అవుతుందా?


సమస్యల్లో ఉన్న లక్ష్మీ విలాస్ బ్యాంక్‌పై ఆర్బీఐ మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ను టేకోవర్ చేయడానికి DBS గ్రూప్ ఆశక్తి చూపుతోంది. ఆగ్నేయ ఆసియాలో అతి పెద్ద లెండర్ అయిన డీబీఎస్ గ్రూప్.. భారతదేశంలో విస్తరణ కార్యకలాపాల కోసం లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ను టేకోవర్ చేయడంపై ఆసక్తి చూపుతోంది.

అయితే, సైద్ధాంతికంగా రెండు ఆర్థిక సంస్థలకు మధ్య తీవ్ర అంతరాలు ఉన్నాయి. వ్యాపార కార్యకలాపాల నుంచి బిజినెస్ కల్చర్ వరకూ విభిన్న రీతులు కావడంతో, ఈ డీల్‌పై ఇప్పుడు అందరి ఆసక్తి కనిపిస్తోంది.

చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లక్ష్మీ విలాస్ బ్యాంక్‌.. బ్యాడ్ లోన్స్, గవర్నెన్స్ సమస్యలతో పాటు సెక్యూర్ కేపిటల్ విషయంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటోంది. దీంతో ఈ  94 సంవత్సరాల చరిత్ర ఉన్న బ్యాంకులో నియంత్రణ వాటా కొనుగోలు చేసికి.. తమ భారత అనుబంధ సంస్థగా మార్చుకునేందుకు రిజర్వ్ బ్యాంకుకు ప్రతిపాదనలు అందించేందుకు  డీబీఎస్ గ్రూప్ సిద్ధమైంది.

అయితే డీబీఎస్ విస్తరణ ప్రణాళికల కోసం ఎల్‌వీబీ పై ఆసక్తి చూపుతూ.. దేశవ్యాప్తంగా వందలాది బ్రాంచ్‌లు ఉన్న డిజిటల్ బ్యాంక్‌గా ఎల్‌వీబీ ని మార్చాలని సింగపూర్ సంస్థ అయిన డీబీఎస్ ఆలోచనగా చెబుతున్నారు.

ప్రస్తుతం డీబీఎస్‌కు దేశవ్యాప్తంగా 30 శాఖలు ఉండగా.. ఎల్‌వీబీకి 550 శాఖలు, 900లకు పైగా ఏటీఎంలు ఉన్నాయి. ప్రస్తుతం 47 బిలియన్ డాలర్ల మార్కెట్ వాల్యూ ఉన్న డీబీఎస్ గ్రూప్.. ప్రతిపాదిత విలీనం కోసం తమ భారతీయ సబ్సిడరీలోకి 2500 కోట్ల రూపాయలను అందించనుందని సమాచారం.tv5awards