ఈక్విటీ మార్కెట్లో పెట్టి కోటీశ్వరులు కావాలంటే..!

ఈక్విటీ మార్కెట్లో పెట్టి కోటీశ్వరులు కావాలంటే..!

ఈక్విటీ మార్కెట్లో పెట్టి కోటీశ్వరులు కావాలంటే..!
వారెన్ బఫెట్, రాకేష్, దమానీలు చేసిందదే!
మీరు కూడా ఫాలో అవ్వండి
ప్రాఫిట్ యువర్ ట్రేడ్ స్పెషల్ స్టోరీ

ప్రపంచంలో ఇప్పుడు అతిపెద్ద ఇన్వెస్టర్లుగా ఉన్నవాళ్లంతా ముందునుంచీ పెద్దవాళ్లు కాదు.. వాళ్లని హీరోలను.. అపర కుబేరులను చేసింది స్టాక్ మార్కెట్.. అందులో కొన్ని స్టాక్స్. నమ్మలేకపోతున్నారా.. కానీ ఇదే నిజం. ప్రపంచ కుబేరుల టాప్10 జాబితాలో ఉన్న అమెరికన్ వారెన్ బఫెట్ ఇన్వెస్టర్ అని తెలుసు కదా.. కొన్నేళ్ల క్రితం యాపిల్ కంపెనీలో చేసిన ఇన్వెస్ట్ మెంట్ ఆయన సంపదను భారీగా పెంచింది. యాపిల్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ. ఇక డిమార్ట్ అధినేత దమానీ వద్దకు వద్దాం.. ఆయన ఎప్పుడో  HDFC బ్యాంకులో ఇన్వెస్ట్ చేశారు. అప్పుడు కంపెనీ వాల్యూ రూ.400 కోట్లు.. ఇప్పుడు 10లక్షల కోట్లు దాటింది. దమానీ ఆస్తులు పెంచింది కూడా ఇలాంటి స్టాక్స్ . దేశంలో టాప్ 10 కోటీశ్వరుల్లో ఒకరు కావడంలో ఆయన ఇన్వెస్ట్ మెంట్లు, స్టాక్స్ ఎంపిక కీలకంగా మారాయి. మరో ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ ఝన్ ఝన్ వాలా కూడా టైటన్ కంపెనీలో పెట్టుబడులే ఆయన ఆస్తులను పెంచాయి. ఇదంతా ఎందుకు అంటే.. వారంతా పెద్ద కంపెనీల్లో పెట్టలేదు. స్మాల్ క్యాప్ కంపెనీలుగా ఉన్న సమయంలో ఇన్వెస్ట్ చేశారు. తర్వాతర్వాత లార్జ్ క్యాప్ కంపెనీలుగా మారాయి. వారి సంపద పెరిగింది. దీర్ఘ కాలిక లక్ష్యాలతో ముందుచూపుతో కొన్ని స్టాక్స్ ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేస్తే అవే పెరుగుతాయి.. మన సంపదను మరో ఎత్తుకు తీసుకెళతాయి.

బ్లైండ్ గా పెడితే బూడిదే..
ఒకటి గుర్తుంచుకొండి స్మార్ట్ ఇన్వెస్టర్ ఎప్పుడూ గుడ్డిగా రికమండేషన్స్ ఫాలో కారు. భిన్నంగా స్టాక్ మార్కెట్ ఎనాల్ సిస్ చేసి ఏయే కంపెనీల్లో పెడితే డబ్బులు వస్తాయో అక్కడ పెడతారు. మంచి స్టాక్స్ ఎంపిక చేసుకుని వాటిపై బెట్ కాస్తారు.  అవును మీరు ఇప్పుడు చూస్తున్న స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో కంపెనీలు రానున్న కాలంలో లార్జ్ క్యాప్ గా మారవచ్చు. వాటిని అంచనా వేసి.. వాటి పనితీరు, ఫండమెంటల్స్ చూసుకుని ఇన్వెస్ట్ చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి. మీరు కూడా భవిష్యత్తులో ఝన్ ఝన్ వాలా అవుతారు. 

గతంలో స్మాల్.. ఇప్పుడు బిగ్ బ్యాగర్స్
బాలక్రిష్ణ ఇండస్ట్రీస్, ఇంద్రప్రస్త గ్యాస్ కంపెనీలు ఒకప్పుడు స్మాల్ క్యాప్ ఫండ్స్. కానీ ఐదేళ్లలో లార్జ్ క్యాప్ గా మారాయి. ఇవే కాదు.. గడిచిన పదేళ్లలో SRF, బజాజ్ ఫైనాన్స్, బర్జర్ పెయింట్స్, ఐషర్ మోటార్స్, MRF,జుబ్లియంట్, ఫుడ్ వర్క్స్, IPCA ల్యాబరేటరీస్, బ్రిటానియా, అపోలో, నెరోలాక్, హావెల్స్, టొరెంట్, అబాట్ ఇండియా వంటి ఎన్నో కంపెనీ స్టాక్స్ ఏ రేంజిలో పెరిగాయో.. ఇన్వెస్టర్ల సంపద ఎంత పెంచాయో కళ్లకు కడుతున్నాయి. 

ఈ స్టాక్స్ పై ఎనలిస్టుల బెట్
పైన చెప్పుకున్న కొన్ని కంపెనీల తరహాలోనే రానున్న కొద్ది సంవత్పరాల్లో స్మాల్ నుంచి లార్జ్ క్యాప్ కు పెరిగే అవకాశమున్న ఇండెక్స్ అంచనా వేస్తున్నారు నిపుణులు. ఇందులో బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్, అంబర్ ఎంటర్ ప్రైజెస్, రిలాక్సో ఫుట్ వేర్, జ్యోతి ల్యాబరేటరీస్, సీక్వెంట్ సైంటిఫిక్, అవంతీ ఫీడ్స్, ఎస్కార్ట్స్, మోల్డ్ టెక్, కోరమండల్ ఇంటర్నేషనల్, సుమిటొమో కెమికల్ వంటి కంపెనీలను సజెస్ట్ చేస్తున్నారు. కొన్ని కంపెనీల ఫండమెంటల్స్ భాగుంటే.. మరికొన్ని కంపెనీలకు లోకల్ ఫర్ వోకల్ నినాదం బలంగా మారనుంది.

అయితే ముందుగానే చెప్పినట్టు ఎవరో చెప్పారని కాదు.. మీరు విశ్లేషించుకుని దీర్ఘకాలికంగా ఏ కంపెనీ షేర్లు మనకు ప్రాఫిట్స్ ఇస్తాయని నమ్ముతారో వాటిపై బెట్ చేయండి. అంతేకానీ వాళ్లు, వీళ్లు సలహా ఇచ్చారని పెట్టి వారిపై నిందలు వేయడం వల్ల స్టాక్ మార్కెట్లో సాధించేదేమీ ఉండదు. ఇక్కడ మీరే నిర్ణేతలు.. మీరే బాధ్యులు.tv5awards