లక్ష్మివిలాస్ బ్యాంకుపై మారిటోరియం

లక్ష్మివిలాస్ బ్యాంకుపై మారిటోరియం

m

 

 

లక్ష్మివిలాస్ బ్యాంకుపై మారిటోరియం
25వేలకు మంచి డ్రా చేయడానికి వీల్లేదు
నెలలో DBS బ్యాంకులో విలీనం
ఖాతాదారులు సేఫ్.. మరి ఇన్వెస్టర్ల సంగతేంటి?

లక్ష్మి విలాస్ బ్యాంక్ పై మారిటోరియం విధిస్తూ ఆర్‌బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 16వరకూ అంటే నెలరోజుల పాటు మారిటోరియం అమల్లో ఉంటుంది. తాజా నిర్ణయంతో కస్టమర్లు తమ ఖాతాలనుంచి రూ.25వేలకు మంచి విత్ డ్రా చేయడానికి వీల్లేదు. అయితే డిపాజిటర్లు అంతకుమించి అత్యవసర పరిస్థితుల్లో విత్ డ్రా చేయాలనుకుంటే  RBI అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వివాహాలు, ఉన్నతవిద్య, ఆసుపత్రి బిల్లల చెల్లింపుల వంటి వాటిని ప్రత్యేకంగా అనుమతి ఇస్తారు. 
బ్యాంకు ఆర్థిక పరిస్థితిని ద్రుష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని RBI ప్రకటించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 సెక్షన్ 45 కింద డిపాజిటర్ల ఆర్థిక ప్రయోజనాలు కాపాడేందుకు అనివార్యంగా నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. 

DBILలో విలీనం
తాత్కాలిక మారిటోరియం అనంతరం ఈ బ్యాంకును డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ లో విలీనం చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధింవచి ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిపింది. డీబీఐఎల్ రూ. 2,500 కోట్లను ముందస్తుగా సమకూరుస్తుంది.  వాస్తవానికి ముందస్తుగానే మెర్జన్ ప్లాన్ చేసి.. రెడీ చేసిన కేంద్రం, RBI ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాయి. ఈరోజు వరకూ బయటపెట్టలేదు. అంతేకాదు.. ఇవాళ కూడా ముందుగా మారిటోరియం ప్రకటన మాత్రమే చేసింది. తర్వాత కొద్ది సమయం తేడాతో మరో నోటిఫికేషన్ తో విలీనం గురించి తెలిపింది. 

నాటకీయ పరిణామాల మధ్య..
గత ఏడాది నుంచే LVB పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్లిక్స్ గ్రూపుతో నిధులు సమీకరణ కోసం చర్చలు జరిపింది. కానీ ఫ్రూట్ ఫుల్ చర్చలు సాగలేదు. అంతకుముందు ఏడాది కూడా ఇండియాబుల్స్ లో విలీనం కోసం ప్రయత్నించింది కానీ  RBI నుంచి అనుమతి రాలేదు. బ్యాంకు పరిస్థితి దిగజారింది. NPAలు రెండో త్రైమాసికంలో ఏకంగా 24.45శాత రిపోర్ట్ చేసింది. గ్రాస్ NPAలు 7.01శాతంగా ఉంది. బ్యాంకు కేపిటల్ కూడా ప్రమాదంలో పడింది. గత ఏడాది బ్యాంకు రూ.47,115 కోట్ల వ్యాపారం చేస్తే.. ఈ ఏడాది ఇదే కాలానికి 37,595 కోట్లకు పడిపోయింది. సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికానికి కంపెనీ నెట్ లాస్ రూ. 396 కోట్లుగా చూపించింది. కంపెనీ పరిస్థితి దిగజారుతుండటంతో డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడటానికే ఈ చర్య తీసుకున్నామన్న  ఆర్‌బీఐ కెనరా బ్యాంక్ మాజీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టీఎన్‌ మనోహరన్‌ను ఎగ్జిక్యూటివ్ గా నియమించింది. ఇటీవల జరిగిన బ్యాంక్‌ జనరల్ బాడీమీటింగులో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.  బ్యాంకు తీరుపై ఆగ్రహంతో ఉన్న వాటాదారులు తాత్కాలిక ఎండీ, సీఈఓగా ఉన్న సుందర్‌ను తిరిగి ఆ పదవిలో తిరిగి నియమించే తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో పాటు మొత్తం ఏడుగురు డైరెక్టర్లు ఎన్‌ సాయిప్రసాద్‌, గోరింక జగన్మోహన్‌ రావు, రఘురాజ్‌ గుజ్జర్‌, కేఆర్‌ ప్రదీప్‌, బీకే మంజునాథ్‌, వైఎన్‌ లక్ష్మీ నారాయణలను ఇండిపెండెంట్‌ డైరెక్టర్లుగా తిరిగి నియమించే తీర్మానాన్ని కూడా  భారీ మెజార్టీతో వ్యతిరేకించారు.

ఇలా బలవంతపు విలీనాలు కొత్తకాదు
గతంలో అంటే 2006లో కూడా IDBI-యునైటెడ్ వెస్టర్న్ బ్యాంక్ మెర్జర్ విషయంలో కూడా ఇదే తరహాలో వ్యవహరించింది. ఒరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లో గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ ను విలీనం చేసింది. అయితే ఆయా బ్యాంకుల ఆర్థిక స్థితిగతులు అంచనా వేసిన తర్వాతే మళ్లీ కోలుకోవడం కష్టమని భావించి.. డిపాజిటర్ల ప్రయోజనాలు కాపాడేందుకు rbI నిర్ణయాలు తీసుకుంది. అయితే విలీనం ద్వారా ఖాతాదారుల ప్రయోజనాలు కాపాడుతున్నా.. మరి ఇన్వెస్టర్ల సంగతేంటన్న ప్రశ్నలు మొదలయ్యాయి. వారి షేర్లు ఏం చేస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రస్తుతం కంపెనీ షేరు 15.55 వద్ద మంగళవారం ముగిసింది.



tv5awards