ఫైజర్ వ్యాక్సిన్ రెడీ.. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లో లాభాల సునామీ

ఫైజర్ వ్యాక్సిన్ రెడీ.. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లో లాభాల సునామీ

ఫైజర్ వ్యాక్సిన్ రెడీ.. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లో లాభాల సునామీ

తాము అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ 90 శాతం పైగా పనిచేస్తోందని ప్రకటించిన ఫార్మా దిగ్గజం ఫైజర్ 
ప్రపంచ చరిత్రలోనే ఇది సైన్స్‌ సాధించిన అపూర్వ విజయం: ఫైజర్‌
కోవిడ్ వ్యాక్సిన్ పరిశోధనా ఫలితాలు పూర్తిగా వెల్లడయ్యేందుకు మరికొంత సమయం పడుతుంది : ఫైజర్ 
ఎవరికి వ్యాక్సిన్ ముందుగా అందుతుంది అన్న అంశం ఇప్పుడే చెప్పలేం : ఫైజర్ 
కోవిడ్ వ్యాక్సిన్ విజయవంతం వార్తతో 1680 పాయింట్లకు పైగా లాభంతో డౌఫ్యూచర్స్

వ్యాక్సిన్‌ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తున్న సమయంలో ఏడారిలో ఓయాసిస్ లా ఫైజర్ కంపెనీ ప్రకటనతో ప్రాణాలు లేచివచ్చినట్టు అయింది. వందల కంపెనీలు పరిశోధనలు చేస్తున్నాయి. పదుల సంఖ్యలో చివరి స్టేజికి వచ్చాయి. ఎట్టికేలకు ప్రపంచంలోని అతిపెద్ద ఫార్మా దిగ్గజాల్లో ఒక్కటైన ఫైజర్ కంపెనీ తమ కోవిడ్ వ్యాక్సిన్ 90శాతం పనిచేసినట్టు ప్రకటించింది. చివరి దశ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు వచ్చినట్టు తెలిపింది. 

మూడో వారంలో అనుమతి..?
జర్మనీకి చెందిన బయోన్‌టెక్‌తో కలిసి ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. వైరస్ లక్షణాలు లేని వారిపై చేసిన ట్రయల్స్ లో 90 శాతం కంటే ఎక్కువగా ప్రభావవంతంగా వ్యాక్సిన్‌ పనిచేసింది. సైడ్ ఎఫెక్ట్ మరియు ఇతర ప్రమాదాలు కూడా గుర్తించలేదని తెలిపింది కంపెనీ.  పూర్తిస్థాయి డేటా రావాల్సి ఉంది. అత్యంత ప్రభావవంతమైన మీజిల్స్ వ్యాక్సిన్లతో సమానంగా తమ కరోనా వ్యాక్సిన్‌ ఉంటుందని కంపెనీ వ్యాఖ్యానించింది. కరోనా మహమ్మారి సంక్షోభ పరిస్థితిలో ఒక  ఏడాదిలోనే వ్యాక్సిన్‌తో ముందుకు వచ్చామని, ఇది ఎవ్వరూ సాధించని గొప్ప విజయమని కంపెనీ చెబుతోంది. తమ వ్యాక్సిన్‌ రోగనిరోధకత ప్రభావం సంవత్సరం పాటు ఉంటుందన్నారు. ఈ నెల చివరిలో రెండు మోతాదుల వ్యాక్సిన్ అత్యవసరంలో భాగంగా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌ను అనుమతి కోరనుంది. ఈ సంవత్సరం చివరి నాటికి 15 నుంచి 20 మిలియన్ల డోసులు తయారు చేయనున్నట్టు ప్రకటించారు. 2021 చివరికి 130 కోట్ల వ్యాక్సిన్ డోసుల్ని సరఫరా చేసేందుకు సిద్దమవుతోంది.  పరీక్షలన్నీ విజయవంతమైతే అక్టోబర్ నాటికి రెగ్యులేటరీ అనుమతులు లభిస్తాయని, నవంబరు నాటికి  వ్యాక్సిన్‌ సిద్దంగా ఉంటుందని ఫైజర్ సీఈఓ డాక్టర్ ఆల్బర్ట్ బౌర్లా ఇప్పటికే ప్రకటించారు.

అమెరికా ఫస్ట్...
5 కోట్ల మందికి 15 వేల కోట్ల రూపాయలకు వ్యాక్సిన్‌ను విక్రయించేందుకు అమెరికా ప్రభుత్వంతో ఫైజర్ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 11  వ్యాక్సిన్లు ప్రయోగాలు చివరి దశలో ఉన్నాయి. నాలుగు అమెరికానుంచే ఉన్నాయి. త్వరలో మోడర్నా, యూకేకు చెందిన ఆక్స్ ఫర్డ్ టీకాలు అందుబాటులోకి రానున్నాయి. 

US మార్కెట్ల జోష్...
జో బైడెన్ విక్టరీతో పాటు.. వ్యాక్సిన్ ప్రకటనతో అమెరికా మార్కెట్లు భారీగా పెరిగాయి. రికార్డు స్థాయిలో పెరిగి లాభాల సునామీ స్రుష్టించాయి. డో జోన్స్ ఏకంగా 5శాతం పెరిగి 1700 పాయింట్లు  ఎగిసింది. S&P 500 ఏకంగా 3.6శాతం పెరిగింది. అటు నాస్ డాక్ కూడా 1.2శాతం అప్ సైడ్ ట్రేడ్ అవుతోంది.  tv5awards