లారస్‌ ల్యాబ్స్‌ లాభంలో 4 రెట్ల వృద్ధి

లారస్‌ ల్యాబ్స్‌ లాభంలో 4 రెట్ల వృద్ధి

హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ లారస్‌ ల్యాబ్స్‌ ఈ ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ నికరలాభం నాలుగు రెట్లకు పైగా వృద్ధితో రూ.242.3 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం 60 శాతం వృద్ధితో రూ.1138.8 కోట్లకు ఎగబాకింది. ఎబిటా 171శాతం వృద్ధితో రూ.373.8 కోట్లకు చేరింది. ఎబిటా మార్జిన్‌ 19.3 శాతం నుంచి 32.8 శాతానికి పెరిగింది. 

కంపెనీ ఫార్ములేషన్‌ బిజినెస్‌లో 180శాతం వృద్ధి నమోదైంది. వివిధ మార్కెట్లలో కొత్త ఔషధాల విడుదలతో కంపెనీ లాభాలు గణనీయంగా పెరిగాయి. మొత్తం రెవిన్యూలో ఈ డివిజన్‌ 40శాతం వాటాను కలిగివుంది. ఇక జెనెరిక్స్‌ ఏపీఐ డివిజన్‌లో 22శాతం వృద్ధితో ఆదాయం రూ.571 కోట్లకు చేరింది. జెనరిక్స్‌ ఎఫ్‌డీఎఫ్‌ బిజినెస్‌ రూ.452 కోట్లకు ఎగబాకింది. 

రిజల్ట్స్ మెరుగ్గా ఉంటాయనే అంచనాలతో ఇవాళ లారస్‌ ల్యాబ్స్‌ 3.3శాతం లాభంతో రూ.333.25 వద్ద ఇవాళ్టి ట్రేడింగ్‌ను ముగించింది. 
 tv5awards