తీవ్ర ఒడిదుడుకులు, చివరకు వరుసగా రెండో రోజూ నష్టాలు

తీవ్ర ఒడిదుడుకులు, చివరకు వరుసగా రెండో రోజూ నష్టాలు

ఇవాళ్టితో అక్టోబర్‌ ఎఫ్‌అండ్‌ఓ సిరీస్‌ ముగియడంతో ఇవాళ దేశీయ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిశాయి. గ్లోబల్‌ మార్కెట్లు బలహీనంగా ఉండటంతో నిఫ్టీ 59 పాయింట్ల నష్టంతో 11670 వద్ద, సెన్సెక్స్‌ 173 పాయింట్ల నష్టంతో 39750 వద్ద ఇవాళ్టి ట్రేడింగ్‌ను ముగించాయి. బ్యాంక్‌ నిఫ్టీ 141 పాయింట్ల నష్టంతో 24092 వద్ద క్లోజైంది. 

జర్మనీ, ఫ్రాన్స్‌ దేశీలు సంపూర్ణ లాక్‌డౌన్‌కు సిద్ధమవుతుండటం, లాక్‌డౌన్‌ ఆంక్షలను సిద్ధం చేస్తున్నట్టు వార్తలు రావడం దేశీయ మార్కెట్ల సెంటిమెంట్‌ను బలపర్చింది. దీంతో పాటు యూరప్‌, అమెరికాలతో పాటు వివిధ దేశాల్లో కోవిడ్‌-19 కేసులు భారీగా పెరుగుతుండటం కూడా ఇవాళ్టి మార్కెట్ల నష్టాలకు ఒక కారణంగా చెప్పొచ్చు. అలాగే నవంబర్‌ 3న జరిగే యూఎస్‌ అధ్యక్ష ఎన్నికల లోపు కరోనా వైరస్‌ సహాయ బిల్లు ఉండదని యూఎస్‌ ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బాగా దెబ్బతీసింది. 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌లు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా ఉన్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌ 3.05శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 2.41 శాతం, శ్రీ సిమెంట్స్‌ 1.48శాతం, కోటక్‌ మహీంద్రా 1.26శాతం, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 1.26 శాతం లాభంతో నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. ఎల్‌అండ్‌టీ 4.92 శాతం, టైటాన్‌ 3.19శాతం, అదాని పోర్ట్స్‌ 3.10 శాతం, ఓఎన్‌జీసీ 2.94 శాతం, టాటా మోటార్స్‌ 2.15 శాతం నష్టంతో నిఫ్టీ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. 


 tv5awards