14 నెలల గరిష్టానికి లక్ష్మి మెషిన్‌ వర్క్స్‌

14 నెలల గరిష్టానికి లక్ష్మి మెషిన్‌ వర్క్స్‌

నిఫ్టీ-500 ఇండెక్స్‌లో టాప్‌ పెర్ఫామర్‌గా కొనసాగుతోంది లక్ష్మి మెషిన్‌ వర్క్స్‌. ఇవాళ ఇంట్రాడేలో ఈ షేర్‌ 4శాతం లాభపడి డే గరిష్ట స్థాయి రూ.4154కు చేరింది. ఇది 2019 ఆగస్ట్‌ గరిష్ట స్థాయి కావడం విశేషం. వరుసగా రెండో రోజూ ఈ స్టాక్‌కు కొనుగోళ్ళ మద్దతు లభిస్తోంది. ప్రస్తుతం లక్ష్మి మెషిన్‌ వర్క్స్‌ 1.65శాతం లాభంతో రూ.4072.55 వద్ద ట్రేడవుతోంది.

చివరి 4 సెషన్స్‌లో ఈ స్టాక్ 3 సెషన్లలో లాభాల్లో కదలాడింది. ఇక ఇవాళ వాల్యూమ్స్ కూడా మెరుగ్గా ఉన్నాయి. 20 రోజుల సగటుతో పోలిస్తే వాల్యూమ్స్‌లో మూడురెట్ల వృద్ధి నమోదైంది. ఇవాళ అన్ని కీ డైలీ మూమింగ్‌ యావరేజీల ఎగువన ఈ స్టాక్‌ ట్రేడవుతోంది. ఈ ఏడాది మార్చి 25న 52వారాల కనిష్ట స్థాయి రూ.2వేలకు పడిపోయిన ఈ స్టాక్‌ ప్రస్తుతం రెట్టింపు స్థాయికి ఎగువన కదలాడుతోంది. 
 tv5awards