అజంతా ఫార్మాకు బైబ్యాక్‌ జోష్‌

అజంతా ఫార్మాకు బైబ్యాక్‌ జోష్‌

బైబ్యాక్‌ జోష్‌తో వరుసగా రెండోరోజూ అంజంతా ఫార్మా పరుగులు తీస్తోంది. ఇవాళ ఇంట్రాడేలో షేర్‌ 5.7శాతం లాభపడి డే గరిష్ట స్థాయి రూ.1683కు చేరింది. ఇది 2 నెలల గరిష్ట స్థాయి కావడం విశేషం. గత 3 నెలల్లో ఈ స్టాక్‌లో ఇంతలా ర్యాలీ రావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం 3శాతం పైగా లాభంతో రూ.1640.40 వద్ద షేర్‌ ట్రేడవుతోంది. ఇక బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి ఇవాళ ఇప్పటివరకు 2.20 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. 

నవంబర్‌ 3న బోర్డు మీటింగ్‌ జరగనున్న అజంతా ఫార్మా ప్రకటించింది. ఈ బోర్డు మీటింగ్‌లో బైబ్యాక్ అంశాన్ని డైరెక్టర్లు పరిశీలించనున్నారు. అలాగే సెప్టెంబర్‌ 30తో ముగిసే రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను కూడా కంపెనీ ప్రకటించనుంది. ఇక ఫైనాన్షియల్స్‌ విషయానికి వస్తే కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.13870.62 కోట్లకు పెరిగింది. ఇండస్ట్రీ పీ/ఈ 35.96 కాగా, కంపెనీ పీ/ఈ 32.06గా ఉంది. బుక్‌ వేల్యూ రూ.282, ఈపీఎస్‌ రూ.49.65గా ఉంది. 
 tv5awards