L&Tలో 9 రోజుల వరుస లాభాలకు బ్రేక్‌..

L&Tలో 9 రోజుల వరుస లాభాలకు బ్రేక్‌..

క్యూ-2 ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకరంగా లేకపోవడంతో ఎల్‌అండ్‌టీలో ఇవాళ 9 రోజుల వరుస ర్యాలీకి బ్రేక్‌పడింది. ఇవాళ ఇంట్రాడేలో షేర్‌ 4.3శాతం నష్టపోయి డే కనిష్ట స్థాయి రూ.940.6కు పడిపోయింది. ప్రస్తుతం ఈ స్టాక్‌ 4శాతం పైగా నష్టంతో రూ.941.35 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి ఇవాళ ఇప్పటివరకు 37.50 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. ఇక కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1,31,838.87 కోట్లకు పడిపోయింది. ఇండస్ట్రీ పీ/ఈ 20.68 కాగా కంపెనీ పీ/ఈ 22.78గా ఉంది. బుక్‌ వేల్యూ రూ.370.90 కాగా, ఈపీఎస్‌ రూ.41.24గా ఉంది.

క్యూ-2 ఆర్థిక ఫలితాలు..
సెప్టెంబర్‌ 30తో ముగిసిన రెండో త్రైమాసికంలో ఎల్‌అండ్‌టీ ఆదాయం 12.2శాతం క్షీణతతో రూ.31034 కోట్లుగా నమోదైంది. అసాధారణ వ్యయం రూ.3732.3 కోట్లుగా ఉంది. ఈ వ్యయానికి ముందుకు కంపెనీ నికరలాభం 41.8శాతం క్షీణతతో రూ.1462.8 కోట్లుగా నమోదైంది. అసాధారణ వ్యయం తర్వాత కంపెనీ నికర నష్టంతో రూ.2322.1 కోట్లకు పడిపోయింది. 

భారీగా తగ్గిన ఎబిటా..
ఇక కంపెనీ ఎబిటా 12శాతం క్షీణతతో రూ.5318.7 కోట్లుగా నమోదైంది. ఎబిటా మార్జిగ్‌ ఫ్లాట్‌గా 17.1శాతం గా ఉంది. క్యూ-2లో ఆర్డర్స్‌ 42 శాతం క్షీణతతో రూ.28039 కోట్లుగా, ఆర్డర్‌ బుక్‌ విలువ 1.4శాతం క్షీణతతో రూ.2,98,856 కోట్లుకు పడిపోయింది. మౌలిక రంగ వ్యాపారం నుంచి కంపెనీ ఆదాయం 20శాతం క్షీణతతో రూ.13095 కోట్లకు పరిమితమైంది. 

వాటాదారులకు డివిడెండ్‌ ప్రకటన..
పవర్‌ వ్యాపార ఆదాయం మాత్రం 40శాతం వృద్ధితో రూ.688.7 కోట్లకు చేరింది. హెవీ ఇంజనీరింగ్‌ వ్యాపార ఆదాయం ఫ్లాట్‌గా రూ.708 కోట్లుగా ఉంది. హైడ్రో కార్బన్‌ బిజినెస్‌ నుంచి ఆదాయం 6శాతం  క్షీణతతో రూ.4049 కోట్లకు పడిపోయింది. డిఫెన్స్‌ ఇంజనీరింగ్‌ ఆదాయం 20శాతం క్షీణతతో రూ.768.8 కోట్లుగా నమోదైంది. ఇక కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేర్‌హోల్డర్లకు డివిడెండ్‌ చెల్లించాలని సిఫార్సు చేసింది. ఒక్కో షేరుపై రూ.18 చొప్పున కంపెనీ డివిడెండ్‌ చెల్లించనుంది.
 



tv5awards