వరుసగా రెండో రోజూ కొనసాగుతోన్న నష్టాలు

వరుసగా రెండో రోజూ కొనసాగుతోన్న నష్టాలు

ఇవాళ అక్టోబర్‌ ఎఫ్‌అండ్‌ఓ సిరీస్‌ ఎక్స్‌పైరీ ఉండటంతో దేశీయ మార్కెట్లు ఒత్తిడికి లోనవుతోన్నాయి. గ్లోబల్‌ మార్కెట్ల సపోర్ట్‌ లేకపోవడంతో ఇవాళ దేశీయ మార్కెట్లు ఒకశాతం దిగువన అంటే సెన్సెక్స్‌ 39537 వద్ద, నిఫ్టీ 11633 వద్ద ఇవాళ్టి ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అన్ని రంగాల కౌంటర్లు అమ్మకాల ఒత్తిడికి గురవుతోన్నాయి. నిఫ్టీ ఆటో, నిఫ్టీ మీడియా ఇండెక్స్‌లు ఒకశాతం పైగా నష్టంతో, ఎఫ్‌ఎంసీజీ,  మెటల్‌ ఇండెక్స్‌లు 0.8శాతం నష్టంతో కదలాడుతోన్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 270 పాయింట్ల నష్టంతో 39653 వద్ద, నిఫ్టీ 83 పాయింట్ల నష్టంతో 11646 వద్ద ట్రేడవుతోన్నాయి. బ్యాంక్‌ నిఫ్టీ దాదాపు 200 పాయింట్ల నష్టంతో 24వేల ఎగువన కొనసాగుతోంది. 

నష్టాలకు కారణమిదే..
జర్మననీ, ఫ్రాన్స్‌ దేశీలు సంపూర్ణ లాక్‌డౌన్‌కు సిద్ధమవుతుండటం, లాక్‌డౌన్‌ ఆంక్షలను సిద్ధం చేస్తున్నట్టు వార్తలు రావడం దేశీయ మార్కెట్ల సెంటిమెంట్‌ను బలపర్చింది. దీంతో పాటు యూరప్‌, అమెరికాలతో పాటు వివిధ దేశాల్లో కోవిడ్‌-19 కేసులు భారీగా పెరుగుతుండటం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. అలాగే నవంబర్‌ 3న జరిగే యూఎస్‌ అధ్యక్ష ఎన్నికల లోపు కరోనా వైరస్‌ సహాయ బిల్లు ఉండదని యూఎస్‌ ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపర్చింది. దీంతో యూఎస్‌ మార్కెట్లు భారీగా నష్టపోగా, ఆసియా మార్కెట్లు నేలచూపులు చూస్తున్నాయి. 

హెవీ వెయిట్‌ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి..
యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎల్‌అండ్‌టీ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌లు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా ఉన్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టీసీఎస్‌లు అరశాతం నుంచి ఒకశాతం పైగా నష్టంతో నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. టైటాన్‌, ఎల్‌అండ్‌టీ, టాటా మోటార్స్‌, ఓఎన్‌జీసీ, టెక్‌ మహీంద్రాలు 2-5శాతం నష్టంతో నిఫ్టీ టాప్‌ లూజర్స్‌గా ట్రేడవుతోన్నాయి. 
 tv5awards