ఏస్ ఇన్వెస్టర్ దమానీ ఏయే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారో తెలుసా?

ఏస్ ఇన్వెస్టర్ దమానీ ఏయే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారో తెలుసా?

ఏస్ ఇన్వెస్టర్ దమానీ ఏయే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారో తెలుసా?

నష్టాలు వచ్చినా అలానే ఉంచారు

మళ్లీ లాభాలు తీసుకుంటున్నారు

ప్రముఖ ఏస్ ఇన్వెస్టర్ మరియు డిమార్ట్ అధినేత రాధాక్రిష్ణ దమానీ అంటే సక్సెస్ కు మారుపేరు. ఆయన ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే వందల మంది రిటైల్ ఇన్వెస్టర్లు అక్కడే పెడుతుంటారు. ఆయన పట్ల వారికి ఉండే గురి అలాంటిది అందుకే దమానీని మదుపుదారులు జాగ్రత్తగా గమనిస్తుంటారు. ప్రస్తుతం ఈ ఏస్ ఇన్వెస్లర్ కు ఏయే కంపెనీల్లో షేర్లు ఉన్నాయో చూద్దామా..
సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో ఆయన పెద్దగా షేర్ల ట్రేడింగ్ ఛేంజస్ చేయలేదు. అంతకుముందు ఉన్నషేర్లలోనే ఇన్వెస్టమెంట్లు కొనసాగిస్తున్నారు. స్పెన్సర్ మాత్రమే అదనంగా 0.11షేర్లు పెంచుకున్నారు. అంతకుముందు ఈ కంపెనీలో ఆయనకు 2.09శాతం స్టేక్ ఉండగా.. తాజాగా మరో 0.11శాతం పెంచి 2.20శాతానికి పెంచారు. దమానీకి దాదాపు 11 కంపెనీల్లో 1శాతానికి పైగా స్టేక్స్ ఉన్నాయి. 
మార్చి పతనం తర్వాత ఆయన షేర్లను విక్రయించలేదు. మళ్లీ లాభాలబాటపట్టాయి. మార్చి 23 తర్వాత ఏ కంపెనీ ఎంత లాభాలు ఇచ్చిందంటే..
1.ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రోడక్ట్స్ కంపెనీలో ఆయనకు 1.03శాతం వాటా ఉంది. మార్చి తర్వాత ఇందులో ఆయనకు 120శాతం పెరిగిమంచి లాభాలు ఇచ్చింది. 
2. అవెన్యూ సూపర్ మార్ట్స్.. దమానీనే స్థాపించిన ఈ కంపెనీలో ఆయనకు 51.48శాతం వాటా ఉంది. 20శాతం షేరు ధర పెరిగింది. 
3.BF యుటిలిటీస్ లో దమానీకి 1.30శాతం వాటా ఉంది. ఈ స్టాక్ మళ్లీ 57శాతంపెరిగింది.
4.ఫుడ్స్ & ఇన్స్ కంపెనీలో 4.72శాతం వాటా ఉంది.మార్చి తర్వాత మళ్లీ కంపెనీ 32శాతం పెరిగింది.
5.కాయా కంపెనీలో ఆయనకు 1.11శాతం వాటా ఉంది. ఈ కంపెనీ మార్చి తర్వాత ఏకంగా 96శాతం మళ్లీ పెరిగింది.
6. సింప్లెక్స్ ఇన్ ఫ్రాస్ర్టక్చర్స్ కంపెనీలో దమానీకి 2.20శాతం వాటా ఉంది. ఈ కంపెనీ స్టాక్ మార్చి తర్వాత మళ్లీ 22శాతం పెరిగింది.
7.స్పెన్సర్ రిటైల్ కంపెనీలో 2.20శాతం వాటా ఉంది.ఈ స్టాక్ 40శాతం వ్రుద్ధి చూపించింది.
8. ది ఇండియా సిమెంట్స్ కంపెనీ లో 12.14శాతం వాటా ఉంది. ఈ కంపెనీ షేరు మార్చి తర్వాత మళ్లీ 32శాతం గ్రోత్ చూపించింది.
9.VST ఇండస్ట్రీస్ లో 4.97శాతం వాటా కొన్నారు దమానీ. ఇది 20శాతం పెరిగింది.
10.ప్రోజన్ ఇంటు ప్రాపర్టీస్ లో దమానీకి 1.26శాతం వాటా ఉంది. ఈ కంపెనీ షేరు 86శాతంపెరిగింది.
11. మంగళం ఆర్గానిక్ కంపెనీలో 2.17శాతం వాటా ఉంది. ఇది మార్చి తర్వాత ఏకంగా 218శాతం మళ్లీ పుంజుకుంది.tv5awards