45శాతం తగ్గిన L&T లాభం

45శాతం తగ్గిన L&T లాభం

45శాతం తగ్గిన L&T లాభం
Q2 ఫలితాలు విడుదల చేసిన కంపెనీ

ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి L&T కంపెనీ ఆర్థిక ఫలితాలు వెల్లడించింది. కంపెనీ రూ.1410.29 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం 2019-20లో ఇదే కాలానికి కంపెనీ ఏకంగా రూ.2551.67 కోట్ల నికర లాభాన్ని చూపించింది. అంటే గత ఏడాది కంటే ఇది 45శాతం తక్కువ. కంపెనీ లాభాలపై కోవిడ్ ఎఫెక్ట్ బలంగా పడింది. మొత్తం రెవిన్యూ గత ఏడాది 35,924 కోట్లు కాగా, ప్రస్తుతం 31,593 కోట్లకు పరిమితం అయింది. ఇక వ్యయం కూడా 29,455 కోట్లకు చేరింది. కంపెనీ రెవిన్యూ గ్లోబల్ ఇన్ కం 39శాతం వాటాతో 12148 కోట్లుగా ఉంది.కొత్తగా ఈ త్రైమాసికంలో కంపెనీకి ఏకంగా 28,039 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లు లభించాయి. ప్రస్తుతం కంపెనీ చేతిలో రూ.2,98,856 ఆర్డర్లు ఉన్నాయి.tv5awards