బ్లాక్ స్టోన్ చేతికి L&T మ్యూచువల్ ఫండ్ కంపెనీ?

బ్లాక్ స్టోన్ చేతికి L&T మ్యూచువల్ ఫండ్ కంపెనీ?

బ్లాక్ స్టోన్ చేతికి L&T మ్యూచువల్ ఫండ్ కంపెనీ?
కంపెనీల మధ్య డిస్కషన్
మొత్తం వాటాలను దక్కించుకునేందుకు రెడీ?
డీల్ ఒకే అయితే విదేశీ సంస్థ చేతిలోకి తొలి దేశీయ AMC

దేశీయ మార్కెట్లో విభిన్న రంగాల్లో పెట్టుబడులు పెడుతూ పునాదులు బలంగా మార్చుకుంటున్న అమెరికా కంపెనీ బ్లాక్ స్టోన్ మరో కంపెనీపై కన్నేసింది. L&T కంపెనీకి చెందిన మ్యూచువల్స్ ఫండ్స్ అసెట్ మేనేజ్ మెంట్ AMC ని టేకొవర్ చేయడానికి చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. డీల్ ఓకే అయితే మాత్రం ఓ విదేశీ సంస్థ కొంటున్న తొలి దేశీయ AMC అవుతుంది. ప్రస్తుతం L&T అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీ మొత్తం 39 స్కీములు నిర్వహిస్తోంది. సెప్టెంబర్ నాటికి కంపెనీ మేనేజ్ చేస్తున్న అసెట్ వాల్యూ రూ. 63,050 కోట్లుగా ఉంది. సెప్టెంబర్ రెండోవారంలో సెబీకి దీనికి సంబంధించి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. రెండు సంస్థల మధ్య వాల్యేషన్ చర్చలు నడుస్తున్నాయి. దీనిపై ఏకాభిప్రాయం కుదిరితే నవంబర్ 15 నాటికి డీల్ ఓకే చేసే అవకాశం ఉంది. 

ఇండియాలో బ్లాక్ స్టోన్ దూకుడు
అమెరికాకు చెందిన బ్లాక్ స్టోన్ కంపెనీ ఇండియాలో ఇప్పటివరకూ దాదాపు 15 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఈక్విటీల్లో 6.9బిలియన్ డాలర్లు, రియల్ ఎస్టేట్ లో 7.8బిలియన్ డాలర్లు, టాక్టికల్ అపర్చూనిటీస్ లో 400 మిలియన్ డాలర్లు వెచ్చించింది. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల్లో వందశాతం వాటాలు కూడా తీసుకుంది. ఇప్పుడు ఫైనాన్సియల్ రంగంలో కూడా పూర్తిస్థాయి కంపెనీ నిర్వహణ కోసం L&Tపై కన్నేసింది. అయితే అసెట్ మెనేజ్ మెంట్ కంపెనీల్లో ప్రైవేటు ఈక్విటీలను పరిమితం చేస్తూ నిబంధనలున్నాయి. 40శాతం లోపుమాత్రమే అనుమతిస్తారు. ఇందులో భాగంగా డీల్ కు అనుమతి లభించడం లేదన్న చర్చ ఉంది. అయితే బ్లాక్ స్టోన్ దేశీయంగా అనేక కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు.. సొంతంగా కంపెనీలు నిర్వహిస్తుందని.. దీనికి ఇంకా PEగా చూడకపోవచ్చని నిపుణులు అంటున్నారు. ఏది ఏమైనా L&T కంపెనీ బ్లాక్ స్టోన్ చేతికి పోవడం ఖాయంగా కనిపిస్తోంది.tv5awards