IPOకు మిసెస్ బెక్టార్స్ ఫుడ్ స్సెషాలిటీస్

IPOకు మిసెస్ బెక్టార్స్ ఫుడ్ స్సెషాలిటీస్

దేశీయ ప్రీమియం బిస్కెట్ తయారీ మరియు మల్టీ నేషనల్ చెయిన్ రెస్టారెంట్ లకు ఫుడ్ సప్లయర్ కంపెనీ అయిన మిసెస్ బెక్టార్స్ ఫుడ్ స్పెషాలటీస్ IPOరానుంది. సెబీకి ధరఖాస్తు చేసింది కంపెనీ. ఐపీఓ ద్వారా రూ.550 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతంలోనే 2018లో కంపెనీ ఐపీఓ ప్రయత్నాలు చేసింది. కానీ అనివార్య కారణాలతో వెనక్కు తగ్గింది. మళ్లీ ఇప్పుడు తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం కంపెనీకి పంజాబ్ లోని రాజ్ పురలో ఉన్న యూనిట్ విస్తరణతో పాటు.. కార్పొరేట్ అవసరాలకు నిధులు వినియోగించనున్నట్టు తెలిపింది కంపెనీ. జనవరి లేదా ఫిబ్రవరి మొదటివారంలో IPOకువచ్చే అవకాశం ఉంది.
కంపెనీ ప్రొఫైల్
కంపెనీలో ప్రమోటర్స్ కు 52.45శాతం వాటా ఉంది. ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ అయిన CX పార్టనర్స్ మరియు గేట్ వేకు 46.75శాతం వాటా ఉంది. కంపెనీ బేకింగ్ ఫుడ్ మరియు బిస్కెట్ రంగంలో ఉంది. సబ్ వే, మెక్ డొనాల్డ్, బర్గర్ కింగ్ వంటి మల్టీ నేషనల్ ఫుడ్ చెయిన్ కంపెనీలకు ఫుడ్ ప్రోడక్ట్స్ సరఫరా చేస్తోంది. నేరుగా మార్కెట్లో కూడా విక్రయిస్తుంది. ఇండియన్ రైల్వేస్ తో కూడా కాంట్రాక్ట్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో బిస్కెట్ మరియు బేకరీ ఉత్పత్తులో రంగంలో ఉండి లిస్ట్ అయిన కంపెనీలు బ్రిటానియా, ITC మాత్రమే ఉన్నాయి. మార్కెట్లో మాత్రం చాలాకంపెనీలు పోటీ ఉన్నాయి. మార్చి 31, 2020 నాటికి కంపెనీ రెవిన్యూ రూ.762 కోట్లు కాగా, నెట్ ప్రాఫిట్ 30 కోట్లుగా ఉంది. దేశీయ మార్కెట్లో బిస్కెట్ , బేకరీ మార్కెట్ ప్రస్తుతం 7బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే సుమారు రూ.55వేల కోట్లుకు పైగామాటే. ప్రతి ఏటా 9శాతం పెరుగుతుంది. సో ఈ రంగంలో అవకాశాలు మెరుగ్గా ఉంటాయని కంపెనీ భావిస్తోంది. పైగా మెజర్ కంపెనీలు క్లయింట్స్ గా ఉండటంతో కంపెనీకి కలిసివస్తుందని నమ్మకం. 



tv5awards