స్మాల్‌క్యాప్‌ బెస్ట్‌ పెర్ఫామర్‌ బల్‌రామ్‌పూరి చిని

స్మాల్‌క్యాప్‌ బెస్ట్‌ పెర్ఫామర్‌ బల్‌రామ్‌పూరి చిని

నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌లో ఔట్‌పెర్ఫామ్‌ చేస్తోంది బల్‌రామ్‌పూర్‌ చిని. ఇవాళ ఇంట్రాడేలో ఈ స్టాక్‌ 5.7శాతం లాభపడి రూ.162.7కు చేరింది. గత రెండు నెల్లలో సింగిల్‌ డేలో ఈ స్టాక్‌ భారీగా లాభపడటం ఇదే తొలిసారి. వరుసగా మూడోరోజూ ఈ స్టాక్‌కు కొనుగోళ్ళ మద్దతు లభించడంతో ప్రస్తుతం రెండు నెలల గరిష్ట స్థాయి వద్ద షేర్‌ ట్రేడవుతోంది. గత నెల రోజుల్లో అత్యధిక రోజుల ర్యాలీ ఇదే. గత 3 రోజుల్లో ఈ స్టాక్‌ 8శాతం లాభపడింది.

ఇక వాల్యూమ్స్‌ విషయానికి వస్తే ఇవాళ మెరుగ్గా ఉన్నాయి. 20 రోజుల సగటుతో పోలిస్తే వాల్యూమ్స్‌లో రెట్టింపు వృద్ధి నమోదైంది. 50 రోజుల సగటు కదలిక స్థాయి రూ.152.3 వద్ద సపోర్ట్‌ లభించడంతో ఈ స్టాక్‌లో రీబౌండ్‌ వచ్చింది. ఈ ఏడాది జనవరి 7న 52 వారాల గరిష్ట స్థాయి రూ.195కి చేరింది. ప్రస్తుతం ఆస్థాయికి 17శాతం దిగువన షేర్‌ ట్రేడవుతోంది. 
 tv5awards