ఐపీఓకు వస్తున్న ESFB గురించి మీకు తెలుసా?

ఐపీఓకు వస్తున్న ESFB గురించి మీకు తెలుసా?

ఐపీఓకు వస్తున్న ESFB గురించి మీకు తెలుసా?
రేపే IPO వస్తున్న కంపెనీ
రూ.280 కోట్లు సమీకరణ లక్ష్యం

ఈక్వటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మంగళవారం ఫ్రెష్ IPOకు వస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్ కోసం అక్టోబర్ 19నే బుక్ ఓపెన్ చేసిన కంపెనీ IPO గడువు 22న ముగుస్తుంది. దేశీయ మార్కెట్లోకి వస్తున్న మూడో స్మాల్ బ్యాంక్ ఇది. గతంలో AU స్మాల్ ఫైనాన్స్ , ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు IPO కు వచ్చాయి. 
ESFB గురించి కీ ఫాక్టర్స్
కంపెనీ తొలిసారిగా IPOకు వస్తుంది. రూ.280 కోట్లు సమీకరించనుంది. ఈక్విటాస్ హోల్డింగ్ కంపెనీకి ఉన్న వాటాలో 7.2 కోట్ల షేర్లు ఆఫర్ చేస్తుంది. ఇందులో రూ.51 కోట్లు అర్హత కలిగిన EHL షేర్ హోల్డర్స్ కు ఇస్తుంది. కోటి రూపాయల విలువైన షేర్లు వరకూ ఉద్యోగులకు ఆఫర్ చేస్తుంది.
ప్రైస్ బాండ్ వచ్చి ఈక్విటీ షేరుకు రూ.32-33 మధ్య ఉంటుంది. 
ఈక్వటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మొత్తం రూ.510 కోట్ల వరకు ఫండ్ రైజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మాగ్జిమం 517.6 కోట్లు. ఇందులో భాగంగానే IPO.
నిధులు సమీకరణ ద్వారా సంస్థ సేవలు విస్తరించాలని భావిస్తోంది. ఆర్గానిక్ గ్రోత్, నియంత్రణ సంస్థల నిబంధనలకు అనుగుణంగా పనిచేయడానికి వీలుగా లిక్విడిటీ సమకూర్చుకోవడానికి ప్రయత్నాల్లో ఉంది. క్రిసిల్‌ నివేదిక ప్రకారం బ్యాంకింగ్‌ ఔట్‌లెట్స్‌ ద్వారా 2019లో ఈక్విటాస్‌ స్మాల్‌ బ్యాంక్‌ తొలి ర్యాంకులో నిలిచింది. ఈ విభాగంలో నిర్వహణలోని ఆస్తులు, డిపాజిట్ల రీత్యా రెండో పెద్ద సంస్థగా ఆవిర్భవించింది. దేశీయంగా ఏయూఎంలో 16 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉంది. tv5awards