క్యూ2లో లారస్ ల్యాబ్స్ దుమ్ము రేపుతుందా?

క్యూ2లో లారస్ ల్యాబ్స్ దుమ్ము రేపుతుందా?

- లారస్‌ ల్యాబ్స్‌ క్యూ-2 రిజల్ట్స్‌ ఆకర్షణీయం..
- మొదటి త్రైమాసికం కంటే మరింత మెరుగ్గా రానున్న క్యూ-2 ఫలితాలు
- రూ.200 కోట్లకు మించనున్న క్యూ-2 లాభం?
- ఫార్ములేషన్స్‌ కోసం ఓ చిన్న కంపెనీ లేదా యూనిట్‌ కొనుగోలు అవకాశం
- క్యూఐపీ ఇష్యూ ద్వారా రూ.1000 కోట్లు సమీకరించే అవకాశం
- ఆసక్తి రేపుతున్న లారస్‌ ల్యాబ్స్‌ క్యూ-2 ఫలితాల అంచనాలు

ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి లారస్ ల్యాబ్స్ ఎంతో ఆకర్షణీయమైన ఆదాయాలు-లాభాలు నమోదు చేయనుందా? మొదటి త్రైమాసికంలో ఆర్జించిన నికరలాభం కంటే ఎంతో అధిక నికరలాభాన్ని ప్రకటించబోతుందా? స్టాక్ మార్కెట్ వర్గాల్లో జరుగుతున్న చర్చలను పరిగణలోకి తీసుకుంటే.. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తుంది.

ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి ఆర్థిక పలితాల సీజన్ మొదలైంది. అగ్రశ్రేణి ఐటీ కంపెనీలు ఫలితాలు ప్రకటిస్తున్నాయి. లారస్ ల్యాబ్స్ కూడా ఈ నెలాఖరులో రెండో త్రైమాసిక ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఫలితాలపై మార్కెట్లో ఎంతో భారీగా అంచనాలు వినిపిస్తున్నాయి.
ఈ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్ -జూన్ 2020) రూ.974 కోట్ల ఆదాయాన్ని, రూ.172 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక EPS ( 10 ముఖ విలువ కల ఒక్కో షేరు) రూ.16.10గా నమోదు అయింది. క్రితం ఏఢాది ఇదే మొదటి త్రైమాసికం ఆదాయంతో పోల్చితే ప్రస్తుతం మొదటి త్రైమాసికం ఆదాయం 77శాతం పెరిగింది. అదే విధంగా నికరలాభం 1047శాతం అధికంగా నమోదు అయింది. కంపెనీ పెట్టిన నాటి నుంచి ఇంత అధికంగా ఆదాయం, నికరలాభం నమోదు కావడం ఇదే మొదటిసారి. కానీ ప్రస్తుతం రెండో త్రైమాసికంలో అంతకంటే ఆకర్షణీయమైన ఫలితాలు ప్రకటించే అవకాశం ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.

ఎందుకంటే...
*కరోనా వైరస్ మహమ్మారి విస్తరణ వల్ల ప్రపంచవ్యాప్తంగా యాంటీ రిట్రోవైరల్ ఔషధాలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఈ విభాగంలో ఎంతో సామర్ధ్యం ఉన్న లారస్ ల్యాబ్స్ కు పెద్ద ఎత్తున విదేశాల నుంచి ఆర్డర్లు లభించాయి. ఎంతగానంటే.. తన ప్లాంట్ లో ఆర్డర్లు నిర్వహించలేక హైదరాబాద్ లోని ఇతర ప్లాంట్ లకు ఆర్డర్లను ‘అవుట్ సోర్సింగ్‘ చేస్తోంది.
*ఫార్ములేషన్ల విభాగంలో ఈ సంస్థకు చెందిన విశాఖపట్టణం ప్లాంట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. దీంతో ఫార్ములేషన్ల విభాగంలో ఆదాయాలు బాగా పెరిగినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఫార్ములేషన్ల నుంచి రికార్డు స్థాయి ఆదాయాలు ఈ రెండో త్రైమాసికంలో ఉన్నట్టు సమాచారం.
*కంపెనీల ప్లాంట్లు అన్నీ పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. దీంతో స్వల్పకాలంలో డెలివరీ ఇవ్వాల్సి వచ్చే.. కొత్త ఆర్డర్లు అంగీకరించే పరిస్థితి లేదని అంటున్నారు. 
*ఫార్ములేషన్ల విభాగానికి చెందిన ఏదైనా కంపెనీ కానీ లేక యూనిట్ కానీ కొనుగోలు చేయాలనే ఆలోచనలో కంపెనీ యాజమాన్యం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. 
*వచ్చే ఆరు నెలల వ్యవధిలో ఆకర్షణీయమైన ధరలో క్యూఐపీ ( క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్ మెంట్) చేసి రూ.1000 కోట్లకు పైగా సమీకరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సొమ్ముతో కంపెనీకి ఉన్న అప్పును పూర్తిగా తీసివేయడమే కాకుండా, వర్కింగ్ కేపిటల్ అవసరాల కోసం కొంత సొమ్ము చేతిలో ఉండే సానుకూలత ఏర్పడుతుంది.  

ఆదాయం ఎంత..? లాభం ఎంత?
ఈ నేపథ్యంలో రెండో త్రైమాసికానికి లారస్ ల్యాబ్స్ ఎంత ఆదాయం, నికర లాభాన్ని ప్రకటిస్తుందన్న అంశంపై స్టాక్ మార్కెట్ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఆదాయం, నికరలాభం మొదటి త్రైమాసికం కంటే మించిపోతాయని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఆదాయం రూ.1000 కోట్లు, నికరలాభం రూ.200 కోట్లు కంటే అధికంగా నమోదవుతాయని అంచనా వేస్తున్నారు.

షేర్ ధర ఎంతకావొచ్చు?
లారస్ ల్యాబ్స్ షేర్ ఇటీవల ఒక షేరు అయిదు షేర్లుగా విడిపోయింది. రూ.10 ముఖవిలువ కలిగిన ఒక్కో షేరు రూ.2 ముఖ విలువ కలిగినప అయిదు షేర్లు అయింది. విభజన తర్వాత ఈ షేర్ ట్రేడింగ్ దాదాపు రూ.295 వద్ద ప్రారంభమై రూ.308 వరకూ పెరిగింది. ఈ తర్వాత నాలుగైదు రోజులకు రూ.268 వరకూ పడి మళ్లీ వేగంగా కోలుకొని రూ.343 వరకూ పెరిగింది. మళ్లీ కరెక్షన్ కు గురైంది. ప్రస్తుతం రూ.327 వద్ద ఉంది. ఈ పరిస్థితుల్లో రెండో త్రైమాసికానికి ఆకర్షిణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటిస్తే... షేర్ ధర ఎంత కావొచ్చనే అంశంపై ఎన్నో రకాలైన విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రూ.200-230 కోట్ల నికరలాభాన్ని ప్రకటిస్తే షేర్ ధర రూ.370 వరకూ వెళ్లే అవకాశం ఉందని, అంతకంటే ఎక్కువ నికరలాభాన్ని ఆర్జిస్తే షేర్ ధర ఇంకా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ఎందుకంటే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.172 కోట్ల నికరలాభం వచ్చింది. రెండో త్రైమాసికంలో రూ.230 కోట్లు నికరలాభం వస్తే, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలానికి రూ.400 కోట్ల నికరలాభాన్ని ఆర్జించినట్లు అవుతుంది. దీంతో ఈ షేర్ కు స్టాక్ మార్కెట్లో ఆకర్షణ ఏర్పడుతుంది. అందువల్ల ఇప్పటికే ఈ షేర్ తమ పోర్టుఫోలియోలో ఉన్నవారు ఈ ఫలితాలు వచ్చేవరకు ఎదురుచూడవచ్చు.

ఇన్వెస్టర్లకు గమనిక: లారస్ ల్యాబ్స్ షేరు  PYT(ప్రాఫిట్ యువర్ ట్రేడ్) గత ఆరు నెలలుగా రికమండ్ చేస్తోంది. PYT రికమెండ్ చేసిన నాటి నుంచి చూస్తే ఇప్పటికే ఈ షేరు ధర రెండు రెట్లు పెరిగింది. అప్పట్లో ఈ షేరు కొనుగోలు చేసినవారు ఎంతో లాభాల మీద ఉంటారు. గతంలో ఈ కంపెనీపై ఇచ్చిన రిపోర్టులు కావాలనుకుంటే .. దిగువ లింక్స్ ను క్లిక్ చేయండి.

లారస్ ల్యాబ్స్ షేర్ ధర ఇంకెంత పెరగవచ్చు?(22 సెప్టెంబర్ 2020)

 

అత్యంత ఆకర్షణీయంగా లారస్ ల్యాబ్స్ ఫలితాలు (31 జూలై 2020)tv5awards