మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించిన హెచ్‌సీఎల్‌

మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించిన హెచ్‌సీఎల్‌

సెప్టెంబర్‌ 30తో ముగిసిన రెండో త్రైమాసికంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌ ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగా ఉన్నాయి. కంపెనీ నికరలాభం 18.5 శాతం వృద్ధితో రూ.3142 కోట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ నికరలాభం రూ.2651 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం 6.1శాతం వృద్ధితో రూ.17528 కోట్ల నుంచి రూ.18594 కోట్లకు ఎగబాకింది. ఇక ఒక్కో షేరుపై రూ.4 మధ్యంతర డివిడెండ్‌ చెల్లించేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది

ఎబిటా మార్జిన్‌ ఐదేళ్ళ గరిష్టానికి చేరింది. గత త్రైమాసికంతో పోలిస్తే ఎబిటా మార్జిన్‌ 20.5 శాతం నుంచి 21.6 శాతానికి పెరిగింది. ఎబిటా 9.7 శాతం వృద్ధితో రూ.4016 కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను కంపెనీ ఎబిటా మార్జిన్‌ గైడెన్స్‌ను 19.5-20.5 శాతం నుంచి20-21 శాతానికి పెంచింది. డాలర్‌ రెవిన్యూ గ్రోత్‌ 6.4శాతం వృద్ధితో 2507 మిలియన్‌ డాలర్లకు చేరింది. రెండో త్రైమాసికంలో కంపెనీ 15 ఒప్పందాలను కుదుర్చుకుని పత్రాలపై సంతకాలు చేసింది.