స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ ఇదే తగిన సమయమా?

స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ ఇదే తగిన సమయమా?

స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ ఇదే తగిన సమయమా?
ఇన్వెస్టర్లలో అయోమయం
ఎలాంటి షేర్లలో ఇన్వెస్ట్ చేయాలి?

తాన్లా సోల్యూషన్స్ ఏడు నెలల్లో 700శాతం పెరిగింది. టాటా ఎలక్సీ 200శాతం పెరిగింది. మరో కంపెనీ 3వందల శాతం లాభాలు ఇచ్చింది.
వినటానికి భాగున్నాయి. మార్చిలో పతనంతో చాలామంది ఈ షేర్ల నుంచి కూడా బయటకు వచ్చారు. కానీ ఇప్పుడు వాటిని చూసి అరే అనుకుంటున్నారు. మిస్ అయినందుకు బాధపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అనిశ్చితి ఉంది. వరుసలాభాలు అంతలోనే నష్టాలు. రోజురోజుకు మారుతున్న పరిస్థితులతో మార్కెట్లో ఎత్తుపల్లాలు తప్పడం లేదు. ఇండో చైనా టెన్షన్, అమెరికా ఉద్దీపన ప్యాకేజీ, కరోనా రెండో దశ వ్యాప్తి, ఆర్ధిక వ్యవస్థ గురించి ప్రపంచబ్యాంకు హెచ్చరికలు ఇలా రకరకాల కారణాలు ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమయంలో మార్కెట్లో డబ్బులు పెడితే సురక్షితంగా ఉంటాయా అన్న భయాలు ఉండటం సహజం. 
ఈ జాగ్రత్తలు అవసరం
అయితే ఏమాత్రం భయం వద్దంటున్నారు నిపుణులు. మార్కెట్లో డబ్బు పెడితే లాభాలు వస్తాయంటున్నారు. మార్చిలో మార్కెట్ పతనం సమయంలో చాలామంది భయంతో బయటకొచ్చారు. రెండుమూడు వారాల్లో మినిమం ప్రాఫిట్ చూసుకుని ఇంకొందరు బయటపడ్డారు. కానీ కొంతమంది కొనసాగడంతో లక్ష పెడితే 8లక్షల వరకూ లాభాలు స్వీకరించారు. అంటే ధైర్యంగా పెట్టాలి. అంటే బేర్ లో ఛాలెంజ్ స్వీకరించాలి. అలాగని గుడ్డిగా వీరు కంపెనీలను నమ్ముకోలేదు. వాటి పనితీరుతో పాటు.. ఫండమెంటల్స్, నిపుణుల సలహాలు తీసుకోవాలి. ముందుముందు కంపెనీల భవిష్యత్తును ఊహించాలి. గత చరిత్రను అంచనా వేయాలి. అలా అయితే ఇప్పుడు కూడా మీరు మార్కెట్లో ఉన్న అనిశ్చిత పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. కాకపోతే నిపుణుల సలహాలు తీసుకోండి. ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ మీ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది.
ఇదే మా సలహా...
ఇప్పుడు అత్యధికంగా లాభాలు స్వీకరిస్తున్న కంపెనీల గురించి ప్రాఫిట్ యువర్ ట్రేడ్ ముందే చెప్పింది. టీవీ5 బిజినెస్ టీమ్ కూడా పలుమార్లు ఇన్వెస్టర్ల సలహాలకు తగు సూచనలు చేసింది. లాభపడ్డారు కూడా.. మీకు కూడా సరైన సలహాలు, సూచనలు, ఎప్పటికి అప్పుడు మార్కెట్ అప్ డేట్స్ కావాలన్నా,  అనుమానాలు ఉన్నా.. ఖచ్చితంగా టీవీ5 మనీ షో చూడవచ్చు. ఫోన్ కాల్స్ ద్వారా తెలుసుకునే నిపుణులను సంప్రదించవచ్చు. మంచి పనితీరు కనపరుస్తూ.. అవకాశాలు మెండుగా ఉన్న కంపెనీల సమగ్ర వివరాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎందులో ఇన్వెస్ట్  చేస్తే లాభాలు వస్తాయో చెప్పడానికి నిపుణులు రెడీ ఉంటారు.