మళ్ళీ 40వేల ఎగువకు సెన్సెక్స్‌

మళ్ళీ 40వేల ఎగువకు సెన్సెక్స్‌

3 వారాల్లో తొలిసారిగా నష్టలను చవిచూసిన దేశీయ మార్కెట్లు ఇవాళ కోలుకున్నాయి. సెన్సెక్స్‌ అరశాతం లాభంతో 39936 వద్ద, నిఫ్టీ 0.4శాతం లాభంతో 11727 వద్ద ఇవాళ్టి ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రస్తుతం అన్ని రంగాల సూచీలు లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ బ్యాంక్‌, పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌లు 0.6శాతం లాభంతో, మెటల్‌, మీడియా, ఎఫ్‌ఎంసీజీ సూచీలు అరశాతం లాభంతో కదలాడుతోన్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 363 పాయింట్ల లాభంతో 40091 వద్ద, నిఫ్టీ 95 పాయింట్ల లాభంతో 11775 వద్ద ట్రేడవుతోన్నాయి. 

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌లు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా ఉన్నాయి. ఇన్ఫోసిస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రాలు నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. యూపీఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఐఓసీ, ఐటీసీ, కోల్‌ ఇండియాలు నిఫ్టీ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.  

  Market opens : Sensex is up 311.22 points or 0.78 percent at 40039.63, and the Nifty jumped 75 points or 0.64 percent at 11755.40. Infosys, IndusInd Bank and HDFC Bank are the top gainers while HCL Tech, Infosys and Mindtree are the most active stocks.  Among the sectors, the IT index added over a percent while the midcap and smallcap indices are up half a percent each.