సెబీకి లేఖ రాయలేదన్న మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్

సెబీకి లేఖ రాయలేదన్న మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్

సెబీకి లేఖ రాయలేదన్న మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్
స్టాక్ క్యాప్ పై ఎలాంటి చర్చా జరగలేదు
క్లారిటీ ఇచ్చిన AMFI

మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ బాడీ AMFIగురువారం  కీలక ప్రకటన చేసింది. కొత్త బెంచ్ మార్క్ ఇండెక్స్‌ను ప్రారంభించాలని.. లేదా ఇండెక్స్‌లో ఏదైనా స్టాక్‌ను క్యాప్ చేయడం కోసం సెబీకి ఎలాంటి ప్రతిపాదన పంపలేదని తేల్చి చెప్పింది. బయట వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పింది.  ఒకే స్టాక్ క్యాపింగ్ పై సెబీ మార్గదర్శకాలకు పరిశ్రమ కట్టుబడి ఉంటుందని ఇందులో స్పష్టంచేసింది. కొత్తగా ఎలాంటి నిబంధనలు పెట్టాలని తామూ కోరడం లేదన్నారు. 
ఏదైనా మ్యూచువల్ ఫండ్ పథకాన్ని ప్రారంభించినప్పుడల్లా, ఫండ్ హౌస్ తగిన బెంచ్ మార్క్ ఇండెక్స్ ను ఎంచుకుంటుంది.  ఇది స్కీమ్ యొక్క పోర్ట్‌ఫోలియో కూర్పు ఆధారంగా ఉంటుంది. పనితీరు ఆధారంగా ఎంపిక చేసుకోవడం జరుగుతుందన్నారు. మ్యూచువల్ ఫండ్ పథకాలు స్టాక్‌పై 10% పరిమితిని కలిగి ఉంటాయి. పంచవ్యాప్తంగా, ఇండెక్స్ సూచికలు, ఏజెన్సీలు ఇచ్చే రేటింగ్ ఆధారంగా పెట్టుబడి పరిమితులకు ఉంటాయి. వాటినే ప్రామాణికంగా తీసుకుంటాయి ఫండ్ హౌస్ లు. సెబీలో రిజిస్టర్ చేయబడిన మొత్తం 44 సంస్థలున్నాయి. ఇవన్నీ అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (అమ్ఫీ) లో సభ్యులుగా ఉన్నాయి.