ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆస్తి ఎంతో తెలుసా?

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆస్తి ఎంతో తెలుసా?

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆస్తి ఎంతో తెలుసా?

జూన్‌ 30 నాటికి  ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆస్తులు రూ. 2.85 కోట్లు. ఈ విషయాన్ని మోదీ స్వయంగా తెలిపారు. రూ. 31,450 నగదు ఉండగా, ఎస్బీఐ గాంధీనగర్‌ బ్రాంచిలో 3,38,173 రూపాయలున్నాయి. ఇక అదే బ్రాంచ్‌లో ఓ ఎఫ్‌డీ కూడా ఉంది. మల్టీ ఆప్షన్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో రూ. 1 కోటీ 60లక్షల28వేల 939 ఉంది. ఇక నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్స్ విలువ రూ. 8,43,124గా ఉంది. బీమా పాలసీల విలువ రూ. 1,50,597.  టాక్స్‌ సేవింగ్‌ ఇన్‌ఫ్రా బాండ్ల విలువ రూ. 20 వేలు.45 గ్రాముల బరువుగల నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి. వాటి విలువ రూ. 1.5 లక్షలు.  గాంధీనగర్‌లోని సెక్టార్‌-1లో ఓ ప్లాట్‌ ఉంది. 3,531 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఉమ్మడి ఆస్తి ఉంది. పద్దెనిమిదేళ్ల క్రితం అంటే, గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడానికి ముందే కొన్న స్థలం. అప్పుడు ఆ ప్లాట్‌ విలువ 1.3 లక్షల రూపాయలు. ఇక ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ. 1.10 కోట్లు ఉంటుందని అంచనా. 
అమిత్‌ షా ఆస్తి విలువ రూ. 28.63 కోట్లుగా చూపించారు. గుజరాత్‌లోని సంపన్న కుటుంబానికి చెందిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సంపదలో తగ్గుదల కనిపించింది. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, జూన్‌ 2020 నాటికి అమిత్‌ షా ఆస్తి విలువ రూ. 28.63 కోట్లు. గతేడాది రూ. 32.3 కోట్లు.