టాటా మోటార్స్ లో రాకేష్ ఝన్ ఝున్ వాలా పెట్టుబడులు

టాటా మోటార్స్ లో రాకేష్ ఝన్ ఝున్ వాలా పెట్టుబడులు

ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ ఝన్ ఝన్ వాలా టాటా సన్స్ కు చెందిన టాటా మోటర్స్ లో 1.29శాతం వాటా కలిగిఉన్నట్టు సంస్థ ప్రకటించింది. సెప్టెంబర్  ఆఖరి నాటికి కంపెనీలో మెజన్ మైనార్టీ షేర్ హోల్డర్ గా ఉన్నారు. 4 కోట్ల షేర్లు ఆయన సొంతం. ఆయనుకున్న టాటా మోటర్ షేర్లు ప్రైస్ ప్రజంట్ రూ. 131 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్చి తర్వాత కంపెనీ షేరు దాదాపు రెట్టింపు అయింది. మార్చిలో ఇది రూ.63 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. రుణరహిత కంపెనీగా అవతరిస్తుందన్న నమ్మకం తనకుందని.. అందుకే ఇన్వెస్ట్ చేసినట్టు చెబుతున్నారు రాకేష్. ఇప్పుడే కాదు.. గతంలో కూడా టాటా గ్రూపునకు చెందిన పలు కంపెనీల్లో రాకేష్ ఇన్వెస్ట్ చేశారు. ఇందులో ఇండియన్ హోటల్స్, రాలీస్ ఇండియా, టైటన్ వంటి కంపెనీల్లో రాకేష్ షేర్లున్నాయి. అటు టాటా సన్స్ కూడా మోటార్స్ లో క్రమంగా వాటా పెంచుకుంటోంది. జూన్ లో 5.26శాతం ఉండగా.. ప్రజంట్ సెప్టెంబర్ నాటికి 7.14శాతం పెంచింది. 


అటు ఇన్వెస్లర్లు దీనిపై సానుకూలంగా ఉన్నా.. ఏజెన్సీలు రేటింగ్ తగ్గిస్తునాయి. కంపెనీకి చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీ ఏటా 32శాతం నష్టాలు చవిచూస్తోంది. దీంతో రేటింగ్ తగ్గించినట్టు చెబుతున్నాయి. అయితే కంపెనీ మాత్రం తమ ప్రణాళికులు తమకున్నాయి.. రానున్న మూడేళ్లలో అప్పులు జీరో లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రకటించింది. కంపెనీకి దాదాపు రూ.30వేల కోట్ల అప్పులు ఉన్నాయి.