గ్లోబల్ వ్యాపారం, రుపీ మారకం, కరోనా ప్రభావం.. AGMలో నాట్కో ఛైర్మన్ ఏమన్నారు???

గ్లోబల్ వ్యాపారం, రుపీ మారకం, కరోనా ప్రభావం.. AGMలో నాట్కో ఛైర్మన్ ఏమన్నారు???

ప్రియమైన షేర్‌హోల్డర్లకు,

శుభోదయం!

 

బోర్డు డైరెక్టర్ల తరఫున, నేను మీ కంపెనీ 37వ వార్షిక సర్వసభ్య సమావేశానికి స్వాగతం పలుకుతున్నాను.

 

ఈ సంవత్సరం మాక్రో ఎకానమీ సవాళ్లతో ప్రారంభమై, ప్రపంచంలోని అందరికీ జీవనోపాధిపై భారీ ముప్పును ఏర్పరచి ముగుస్తోంది.  ఇటువంటి ఏడాదిలో  ఉద్యోగుల భద్రత, ఆర్థిక క్రమశిక్షణ మరియు మన వ్యాపారాన్ని భద్రపరచడం  నాట్కోకు చాలా ముఖ్యమైన అంశం అని మేము నమ్మకంగా చెప్పగలం. మేము దీన్ని చాలా జాగ్రత్తగా నిర్వహించాము.

మార్చి 31, 2020 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో, కంపెనీ మొత్తం ఆదాయం రూ. 2,022.4 కోట్లు, పన్ను తర్వాత నికర లాభాలతో (PAT) రూ.458.1 కోట్లు.  అనేక అవరోధాలు ఎదురైనా,  టాప్‌లైన్ ఆదాయాన్ని స్థిరంగా ఉంచగలిగాము.  ఈ సంవత్సరంలో మా PAT  తగ్గినా, మా వ్యాపార విభాగాలలో అనేక అధిక విలువ కలిగిన ఉత్పత్తులను లాంచ్‌ చేయడంతో, రాబోయే సంవత్సరాల్లో పనితీరు పై మేము ఉత్సాహంగా ఉన్నాము. కంపెనీకి ముందు వడ్డీ, పన్ను, డిప్రిసియేషన్ & అమార్టైజేషన్ (EBITDA) మార్జిన్ ఆరోగ్యకరమైన స్థాయి అయిన 34% వద్ద ఉంది.

నాట్కో సంస్థ  35 సంవత్సరాల తన ప్రత్యేకమైన ప్రయాణంలో ఆవిష్కరణ మరియు వ్యాపార వృద్ధిలో అనేక సవాళ్లను అధిగమించింది.  సమీక్ష నిర్వహించిన సంవత్సరంలో, ధరల ఒత్తిళ్లు, పోటీ తీవ్రత మరియు స్థూల ఆర్థిక సవాళ్ల రూపంలో ఇబ్బందులను ఎదుర్కొన్నాము, అయినా మేము విధులను కొనసాగించాము; భవిష్యత్తుపై దృష్టి కేంద్రీకరించి, మరియు రాబోయే సంవత్సరాల్లో మంచి వృద్ధిని సాధించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నాము.

 

దేశీయ మార్కెట్: కఠినమైన సంవత్సరం

నాట్కోకు దేశీయ భారత వ్యాపారం... మొత్తం కన్సాలిడేటెడ్ ఆదాయంలో 29%. దేశీయ వ్యాపారానికి కొన్ని రంగాల్లో నాట్కోకు ఇది కఠినమైన సంవత్సరం.  ప్రభుత్వం విధించిన ధరల నియంత్రణ కారణంగా మా ఆంకాలజీ విభాగం ఇబ్బందులు ఎదుర్కుంది, అలాగే మార్కెట్ పరిమాణం తగ్గడంతో మా హెపటైటిస్-సి వ్యాపారం క్రమంగా తగ్గుతూ వచ్చింది.  దీనిపై, Q4 సమయంలో, COVID-19 వ్యాప్తి ఫలితంగా క్యాన్సర్ రోగులు వారి ఆసుపత్రి సందర్శనలను, కీమోథెరపీ విధానాలను వాయిదా వేసుకున్నారు.  ఇవి ఈ ఏడాది వ్యాపారం స్వల్పంగా క్షీణించటానికి సమిష్టిగా కారణమయ్యాయి.

image

దేశీయ వ్యాపారం తగ్గడానికి ఇవి కారణాలుగా నిలిచినా, కీలకమైన విభాగాలలో మా మార్కెట్ స్థానాన్ని నిలుపుకోగలిగాము. ఆర్థిక వ్యవస్థలో కొత్త సాధారణం (న్యూ నార్మల్) అనే పద్ధతి ప్రారంభంతో, సవాళ్లను ఎదుర్కొంటూనే ఫార్మాలో వృద్ధి సామర్థ్యం గురించి మరియు క్రాప్ హెల్త్ సైన్సెస్‌లోకి ప్రవేశించడంపై దృష్టి సారించాము.

 

అంతర్జాతీయ మార్కెట్లు: ధృడంగా వ్యాపారం

మొత్తం అంతర్జాతీయ వ్యాపారం, అనుబంధ సంస్థలతో సహా, కన్సాలిడేటెడ్ ఆదాయంలో దాదాపు 62 శాతంగా ఉంది.  ప్రస్తుత సంవత్సరంలో, మా యాంటీవైరల్ ఫ్లూ ఔశధం ఒసెల్టామివిర్ కోసం ధరల ఒత్తిళ్లు, పోటీ ఉన్నప్పటికీ మా యూఎస్ ఆధారిత వ్యాపారం బలంగా ఉంది. గ్లాటిరామర్ అసిటేట్ మరియు లిపోసోమల్ డోక్సోరోబిసిన్ ద్వారా ఆదాయం ఈ సంవత్సరంలో పెరుగుతూనే ఉంది, దీనికి ఎక్స్‌ఛేంజ్ రేట్ సహాయపడింది.  అంతర్జాతీయ మార్కెట్ల విషయంలో మా ఫెసిలీటీస్ విషయంలో మేము ఎటువంటి కంప్లయన్స్ సమస్యలను ఎదుర్కోలేదు. నాట్కో ANDA లను ఫైల్ చేస్తూనే ఉంది, వాటిలో కొన్ని ఫస్ట్ టు ఫైల్ (FTF) అని మేము విశ్వసిస్తున్నాము. యుఎస్ మార్కెట్లో మరింత స్థిరమైన ధరల దృక్పథాన్ని కూడా గమనించాము.

రాబోయే కొద్ది సంవత్సరాల్లో లాంఛ్ చేసేందుకు, మా బ్లాక్‌బస్టర్ ఉత్పత్తి లెనాలిడోమైడ్‌తో సహా,  మా ఉత్పత్తి పైప్‌లైన్ ఉండడంపై మేము సంతోషంగా ఉన్నాము, ఇది తదుపరి వృద్ధికి మాకు మార్గం సుగమం చేస్తుంది.  కెనడాలో మా వ్యాపారం ఈ సంవత్సరంలో బాగుంది, బ్రెజిల్‌లో మా ప్రయత్నాలు వృద్ధికి అవకాశం ఇచ్చాయి.  అలాగే ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో వ్యాపార వృద్ధికి మంచి పునాది వేస్తూనే ఉన్నాము.

మా ఆదాయాలు, లాభదాయకతను మెరుగుపరిచేందుకు ‘ఇతర ప్రపంచ దేశాల’ మార్కెట్లలో మా ప్రయత్నాలను ఎక్కువగా కేంద్రీకరించడానికి వ్యూహాత్మక ప్రాధాన్యత ఇచ్చాము.  కెనడా, బ్రెజిల్‌ దేశాలతో పాటు ఇతర మార్కెట్లలో మంచి వృద్ధి సామర్థ్యం అవకాశాలు ఉన్నాయని గమనించాము.

 

 

ఎదగడంలో నిలకడ - అడ్డంకులను అధిరోహించడం

ఉత్తమంగా చేసే కృషిపై స్థిరత్వాన్ని కొనసాగించడం, వనరులను వివేకంతో నిర్వహించడంపై కొత్త విషయాల అవలోకనం, నమ్మకమైన సంబంధాలను నిర్మించడం ద్వారా సుస్థిరత సాధించడం అనే మా మిషన్‌కు మొదటి స్థానం ఇవ్వడం కొనసాగిస్తున్నాము.

2019-20 చివరి దశకు మహమ్మారి ఒత్తిళ్లతో పాటు వ్యాపార సవాళ్లను సంస్థ ఎదుర్కొంది.  ఈ ప్రతిబంధకాలు ఉన్నా కార్యకలాపాలు, అవకాశాలకు తిరిగి ప్రాధాన్యత ఇవ్వడానికి కంపెనీ చురుకుగా వ్యవహరిస్తోంది. మహమ్మారి కారణంగా అవరోధాలు కొనసాగుతుండడంతో ఉద్యోగుల ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించాము, పని వాతావరణాన్ని శుభ్రంగా, సురక్షితంగా ఉంచే పద్ధతిని తిరిగి శక్తివంతం చేశాము.

image

కొత్త వాతావరణానికి అనుగుణంగా సరళమైన, చురుకైన విధంగా నేర్చుకోవడం అనేది ప్రధానమైన సారాంశం, ఇది మా డీఎన్ఏలో అత్యంత ప్రధానం. రోగి యొక్క అపరిష్కృత అవసరాలను నెరవేర్చడానికి అందుబాటు ధరకు ఎక్కువ ఔషధాలను తీసుకువస్తూ, ఏటేటా మా వ్యాపారంలో స్థిరత్వాన్ని పెంచుతాము.  ఇది సాధ్యం కావడానికి మేము పేటెంట్ పరిమితులను పరిశీలిస్తూనే ఉంటాము, అలాగే మా ఉత్పత్తి అభివృద్ధి సామర్థ్యాలను, పార్ట్‌నర్‌షిప్ బలాన్ని మెరుగుపరుస్తాము.

పునరుత్పాదక శక్తిని ఉపయోగించడం అనేది స్థిరమైన కార్యకలాపాలకు సంబంధించిన అంశం, ఇది పర్యావరణంపై బాధ్యత వహించే విధంగా శక్తి అవసరాలను తీర్చడానికి మేము ఇరుసుగా ఉంటాము.  మార్చి 31, 2020 నాటికి, నాట్కో యొక్క మొత్తం పునరుత్పాదక శక్తి (RE) సామర్థ్యం తృతీయ పక్ష కొనుగోలు ఒప్పందాల ద్వారా పునరుత్పాదక శక్తికి అదనంగా, పవన విద్యుత్ రంగంలో 4.2 మెగావాట్లు, అలాగే సౌర రంగంలో 5.2 మెగావాట్లుగా ఉంది.

మేము సుస్థిరత కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించే చర్యలను కొనసాగిస్తాము, విలువను సృష్టించడంతో పాటు మా వాటాదారులకు అవకాశాలను అభివృద్ధి చేస్తాము.

 

భవిష్యత్‌లో పెట్టుబడులు

మేము మా పరిశోధన, తయారీ ప్లాంట్లు, నైపుణ్యాలను సమృద్ధిగా పెట్టుబడి పెట్టే విషయంలో మా వ్యూహం చెక్కుచెదరలేదు. భారతదేశంలో మా ఫార్మా బిజినెస్ విభాగాలలో ప్రతి ఏటా 8 నుంచి 10 కొత్త ఉత్పత్తులను విడుదల చేయాలనే మా లక్ష్యాన్ని అందుకునే దారిలోనే ఉన్నాము. రాబోయే సంవత్సరాల్లో మా అంతర్జాతీయ మార్కెట్లలో కొన్ని ఆసక్తికరమైన ఫైలింగ్‌లతో పాటు అధిక-విలువ లాంచ్‌లు కూడా ఉండనున్నాయి.

అధిక ప్రవేశ అడ్డంకులను ఉన్న అంశాలను ఎంచుకునే మా వ్యాపార విధానానికి అనుగుణంగా ఫార్మా, అగ్రి రంగాలలోని అవసరాలకు అనుగుణంగా పరిశోధన మరియు అభివృద్ధికి దోహదం చేయడంపై కంపెనీ మరింతగా దృష్టి సారించింది. మా యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రెడియెంట్స్ (API) బలమైన మద్దతుతో రసాయన శాస్త్రం మరియు  మాలిక్యూల్ డెవలప్మెంట్‌కు మేము ప్రాధాన్యత ఇస్తున్నాము.

ఈ ఏడాదిలో రూ. 3,49.3 కోట్ల రూపాయల మూలధన వ్యయం చేసాము, వీటిలో ఎక్కువ భాగం మా ఉత్పాదక సౌకర్యాలలో మా సామర్థ్యాలను పెంచడానికి ఉపయోగించాము. ఈ కేపెక్స్‌లో ముఖ్యమైన భాగం మా వైజాగ్ సౌకర్యంపై జరిగింది.  మిగిలిన భాగం ప్రధానంగా దేశవ్యాప్తంగా మా ఫార్ములేషన్ ఫెసిలిటీస్‌లో ఉపయోగించాము. మా స్వతంత్ర ఆదాయంలో 8.65 శాతం R&D వైపు ఖర్చు చేయగా, ఇది కంపెనీ వృద్ధికి మూలస్తంభాలలో ఒకటి.

డైవర్సిఫికేషన్, సస్టెయినబిలిటీలను దృష్టిలో ఉంచుకుని, సముచిత ఉత్పత్తులను లక్ష్యంగా చేసుకుని క్రాప్ హెల్త్ సైన్సెస్ విభాగంలో కంపెనీ పెట్టుబడి చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ పూర్తయ్యే దశలో ఉంది, అలాగే 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆరంభమవుతుందని భావిస్తున్నాం.  నాట్కో ఉత్పత్తులను దేశంలోని రైతులకు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర సాగుదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి మేము ఉత్పత్తి అభివృద్ధి, తయారీ, అమ్మకాలు, ఇంకా మార్కెటింగ్‌లో శక్తివంతమైన సిబ్బంది బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాము.

 

 

వైవిధ్యత

మన ప్రజలను శక్తివంతం చేయడం, విలువలతో జీవించేలా చేయడం, నమ్మకమైన సంబంధాలను నిర్మించడమనే మా సంప్రదాయాన్ని... మమ్మల్ని సవాలు చేసే సమయాల్లో కూడా పాటిస్తాము.

కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్) అనేది మా నాట్కో వ్యవస్థలో అంతర్భాగం.  మేము పనిచేసే కమ్యూనిటీలతో పాల్గొనే వృద్ధిని పెంపొందించుకుంటామని నమ్ముతున్నాము.  విద్య, ఆరోగ్యం, జీవనోపాధి రంగాలలో సమాజాలతో పని చేసినప్పుడు, సమాజంపై మా నిబద్ధతను ప్రదర్శిస్తాము. నాట్కో ట్రస్ట్ నిర్వహిస్తున్న పాఠశాలలు కమ్యూనిటీలలో గణనీయమైన విలువను కలిగి ఉన్నాయి.  మా పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు చేయడం, సౌకర్యాలను ఏకకాలంలో అప్‌గ్రేడ్ చేయడం ద్వారా స్పష్టమైన ప్రయోజనాలను గమనిస్తాము. మా ఆరోగ్య సేవలు, వ్యవసాయ ఆధారిత జీవనోపాధి కార్యక్రమాలు... కమ్యూనిటీ విశ్వాసం, విశ్వాసాన్ని పొందాయి.

ఈ సంవత్సరం నాట్కో హైస్కూల్, కొత్తూర్ 25 సంవత్సరాలను పూర్తి చేసుకుంది, తెలంగాణలోని ఇందిరానగర్, సిద్దిపేటలోని జెడ్‌పి హైస్కూల్‌కు ‘నాట్కో ట్రస్ట్ బ్లాక్’ అనే బ్లాక్ నిర్మించడానికి సహాయం చేశాము.  2020 జూలైలో గుంటూరు జనరల్ హాస్పిటల్‌లో 80,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సమగ్ర నాట్కో క్యాన్సర్ కేంద్రాన్ని ప్రారంభించారు.

 

 కృతజ్ఞత

 

మా కస్టమర్లు, భాగస్వాములు, అలాగే మా సహచరులు, ముఖ్యంగా మా పెట్టుబడిదారుకు విలువను సృష్టించే దిశగా, నాట్కోలో మేము నిబద్ధతతో ఉన్నాము.  ప్రత్యేకమైన మందులను అందరికీ అందుబాటులో ఉంచడంలో మా ఆవిష్కరణ, నాణ్యతలు మా బ్రాండ్‌కు ప్రధాన బలాలు, ఇవి మా లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఉపయోగపడతాయి.

మార్చి 31, 2020 నాటికి మీ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ సుమారు రూ. 9,200 కోట్లుగా ఉంది.  ఈ సంవత్సరంలో, మేము నాలుగుసార్లు మధ్యంతర డివిడెండ్లుగా రూ. 1,22.9 కోట్లు ఇచ్చాము.  మధ్యంతర డివిడెండ్ రూపంలో సమీక్షించిన సంవత్సరానికి కంపెనీ పన్ను తర్వాత స్వతంత్ర లాభంలో 25.9 శాతం మొత్తం చెల్లించాము.

మన ఔషధాలతో లక్షలాది మంది జీవితాలను చేరుకున్నప్పుడు, ప్రతిరోజూ మన మిషన్‌లో విజయం సాధిస్తుండడాన్ని చూడటం హృదయపూర్వకంగా సంతోషంగా ఉంటుంది.  5000 మంది సిబ్బంది, భాగస్వాములు, ఇతర ముఖ్య వాటాదారులతో పాటు మా శ్రామిక శక్తి ప్రయత్నాల వల్ల ఇది ప్రధానంగా సాధ్యమైంది.  కలిసికట్టుగా మనం ఒక బలమైన జట్టును తయారు చేస్తాము. పెట్టుబడిదారుల నమ్మకం, విశ్వాసం పట్ల వారికి కృతజ్ఞులం.

 

రేపటి విజయవంతమైన వ్యాపార సంస్థను సృష్టించడానికి మీ నిరంతర మద్దతును మేము ఆశిస్తున్నాము. మీ అందరికీ అనేక ధన్యవాదాలు.

 

ఛైర్మన్

image

 

 

నాట్కో ఫార్మా లిమిటెడ్