Closing Report : కుప్పకూలిన మార్కెట్లు, ఒక్కోరోజే రూ.3.3 లక్షల కోట్ల సంపద ఆవిరి

Closing Report : కుప్పకూలిన మార్కెట్లు, ఒక్కోరోజే రూ.3.3 లక్షల కోట్ల సంపద ఆవిరి
  • కుప్పకూలిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు
  • అక్టోబర్‌ సిరీస్‌లో తొలిసారి నష్టాలు
  • గత 10 సెషన్ల లాభాలకు బ్రేక్‌
  • ఆవిరైన రూ.3.3 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద
  • 10 రోజుల లాభాలు.. ఒక్కరోజులో సగం మాయం..
  • సెన్సెక్స్‌ 40వేల దిగువకు, నిఫ్టీ 11700 దిగువకు పతనం
  • సెన్సెక్స్‌ 1066, నిఫ్టీ 291 పాయింట్ల నష్టం
  • 802 పాయింట్లు కోల్పోయిన బ్యాంక్‌ నిఫ్టీ
  • హెవీ వెయిట్‌ స్టాక్స్‌లో భారీ అమ్మకాల ఒత్తిడి
  • ఇవాళ 3శాతం నష్టపోయిన ఐటీ ఇండెక్స్‌

ఇవాళ దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. దీంతో గత 10 సెషన్లుగా కొనసాగుతోన్న బుల్‌ ర్యాలీకి ఇవాళ బ్రేక్‌ పడినట్లయింది. అక్టోబర్‌ సిరీస్‌లో తొలిసారిగా దేశీయ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ఇవాళ ఉదయం పాజిటివ్‌గా ప్రారంభమైన దేశీయ సూచీలు తొలి 10 నిమిషాల్లోనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత లాభనష్టాల మధ్య ట్రేడైన సూచీలు, ట్రేడింగ్‌ చివరి గంటలో బ్యాంకింగ్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, ఐటీ, టెక్నాలజీ కౌంటర్లు భారీ అమ్మకాల ఒత్తిడికి లోనుకావడంతో భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అలాగే టెలికాం, హెల్త్‌కేర్‌, ఫైనాన్స్‌ స్టాక్స్‌ కూడా భారీ కరెక్షన్‌కు గురయ్యాయి. 

కారణాలివే..
యూరోప్‌ మార్కెట్లు వరుసగా మూడోరోజూ నష్టాలతో ప్రారంభం కావడం, ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ఉండటం, హైయర్‌ లెవల్స్‌లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడం, ఇవాళ ఎఫ్‌అండ్‌ఓ వీక్లీ క్లోజింగ్‌ ఉండటంతో మార్కెట్లు ఒత్తిడికి లోనయ్యాయి. యూఎస్‌ ఉద్దీపన ప్యాకేజీపై ఉన్న చివరి ఆశ కూడా అడియాస కావడంతో, ప్రెసిడెంట్‌ ఎన్నికల తర్వాతే ప్యాకేజీ ఉంటుందని వార్తలు రావడం ప్రపంచ మార్కెట్ల  సెంటిమెంట్‌ను బలహీనపర్చాయి.

10 రోజుల లాభాలు.. ఒక్కరోజులో సగం మాయం..
గత 10 రోజులుగా మార్కెట్లను ఐటీ, బ్యాంకింగ్‌ స్టాక్స్‌ లీడ్‌ చేశాయి. బైబ్యాక్‌ అంచనాలతో ఈనెల్లో ఐటీ ఇండెక్స్‌ 6శాతం పైగా లాభపడింది. ఐటీ కంపెనీల ఆర్థిక ఫలితాలు స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికీ,  టీసీఎస్‌, విప్రోల బైబ్యాక్‌ ఆఫర్‌ మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా లేకపోవడం ఐటీ ఇండెక్స్ ఇవాళ దాదాపు 3 శాతం నష్టపోయింది. ఇక కోవిడ్‌-19తో ప్రపంచ దేశాలు సతమతం కావడం, ఈ మహమ్మారిని నియంత్రించడానికి యూరోపియన్‌ దేశాలు ఆంక్షలను మరింత కఠినతరం చేయడం, ఆర్థిక పునరుద్ధరణ అవకాశాలు తగ్గడం ఇవాళ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. 

11700 దిగువకు నిఫ్టీ..
ఇక ఇవాళ్టి మార్కెట్లకు మిడ్‌సెషన్‌లో హెవీవెయిట్‌ స్టాక్స్‌తో సపోర్ట్‌ లభించినా.. చివరి వరకు దీనిని నిలబెట్టుకోవడంతో సూచీలు విఫలమయ్యాయి. ముఖ్యంగా ఇవాళ హెవీ వెయిట్‌ స్టాక్స్‌ భారీ కరెక్షన్‌కు గురయ్యాయి. మొత్తం మీద సెన్సెక్స్‌ 1066 పాయింట్ల నష్టంతో 39728 వద్ద, నిఫ్టీ 291 పాయింట్ల నష్టంతో 11680 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. ఇంట్రాడేలో సైకలాజికల్‌ ఫిగర్‌ 23వేల దిగువకు పడిపోయినా, ఆ తర్వాత స్వల్పంగా కోలుకుని 802 పాయింట్ల నష్టంతో 23072 వద్ద బ్యాంక్‌ నిఫ్టీ క్లోజైంది. 

హెవీ వెయిట్‌ స్టాక్స్‌లో భారీ అమ్మకాల ఒత్తిడి..
ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు ఇవాళ మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా ఉన్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌ 0.92 శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 0.31 శాతం, హీరోమోటోకార్ప్‌ 0.11శాతం, కోల్ ఇండియా 0.05 శాతం లాభంతో నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ 4.98శాతం, టెక్‌ మహీంద్రా 4.43 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 4.07శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 3.93 శాతం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 3.68 శాతం నష్టంతో ఇవాళ్టి నిఫ్టీ టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి.