వరుసగా రెండో రోజూ మహానగర్‌ గ్యాస్‌కు కొనుగోళ్ళ మద్దతు

వరుసగా రెండో రోజూ మహానగర్‌ గ్యాస్‌కు కొనుగోళ్ళ మద్దతు

నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌లో బెస్ట్ పెర్ఫామర్‌గా ఉంది మహానగర్‌ గ్యాస్‌. ఇవాళ ఈ స్టాక్‌ ఇంట్రాడేలో 4.5శాతం లాభపడి డే గరిష్ట స్థాయి రూ.828కు చేరింది. గత 2 నెలల్లో సింగిల్‌ డేలో ఈ స్టాక్‌ భారీగా లాభపడటం ఇదే తొలిసారి. వరుసగా రెండోరోజూ ఈ స్టాక్‌కు కొనుగోళ్ళ మద్దతు లభిస్తోంది. ప్రస్తుతం 4శాతం లాభంతో రూ.824.60 వద్ద మహానగర్‌ గ్యాస్‌ ట్రేడవుతోంది. 

ఇక ఇవాళ వాల్యూమ్స్‌ మెరుగ్గా ఉన్నాయి. 20 రోజుల సగటుతో పోలిస్తే వాల్యూమ్స్‌లో రెట్టింపు వృద్ధి నమోదైంది. అన్ని ముఖ్యమైన రోజుల కదలిక సగటు స్థాయిల దిగువన ఈ స్టాక్‌ కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి 30న 52 వారాల గరిష్ట స్థాయి రూ.1226కు చేరిన మహానగర్‌ గ్యాస్‌, ప్రస్తుతం ఆ స్థాయికి 32శాతం దిగువన ట్రేడవుతోంది.