ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేముందు సలహాలు అవసరమా?

ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేముందు సలహాలు అవసరమా?

ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేముందు సలహాలు అవసరమా?
ఇంటర్నెట్ సమాచారం సరిపోతుందా?
గూగుల్ నమ్ముకుని పెట్టుబడి పెట్టవచ్చా?
ఎక్స్ పర్ట్ సలహాతో లాభమేంటి?
ప్రాఫిట్ యువర్ ట్రేడ్ స్పెషల్ స్టోరీ

దేశీయ స్టాక్ మార్కెట్ పరుగులు తీస్తోంది. ఆల్ టైం హైం క్యాప్ నడుస్తోంది. FIIలు వెల్లువెత్తుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా వర్క్ ఫ్రం హోం కల్చర్ పెరిగి.. యువత కూడా మార్కెట్ వైపు చూస్తున్నారు. కొత్తగా లక్షల మంది రిటైల్ ఇన్వెస్టర్లు వచ్చారు. ఇప్పుడు యాప్ ల ద్వారానే వ్యాపారం అంతా జరిగిపోతుంది. అయితే కొత్తగా ఈక్విటీ మార్కెట్లోకి  వస్తున్న తరం.. మౌలిక సూత్రం వదిలేసి మార్కెట్లో గేమ్ ఆడుతున్నట్టు కనిపిస్తోంది. దీనికి కారణం నిపుణుల సలహాల కంటే కూడా ఆన్ లైన్ లో ఉండే సమాచారం ఆధారంగా ట్రేడింగ్ చేయడం. మరి ఇది వారికి మేలు చేస్తుందా? ఎక్స్ పర్ట్ సలహాలు లేకుండా కేవలం గూగుల్ నమ్ముకుని ట్రేడ్ చేస్తే లాభాలు వస్తాయా? ఒక్కసారి చూద్దాం..

ఇంటర్నెట్ వల్ల...
మార్కెట్ గురించి తెలుసుకోవడానికి ఇంటర్నెట్ వాడటంలో తప్పులేదు. కానీ మన డబ్బును అలా గుడ్డిగా నమ్మి పెట్టడమే తప్పు. అసలు ప్రమాదం ఇక్కడే ఉంది. కొన్ని కంపెనీలు ఫండమెంటల్ గా బలంగా లేకుండానే స్పెక్యులేషన్ ద్వారా వాల్యూ పెంచుకోవడానికి, షేర్ ప్రైస్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తాయి. వాటికి ఉన్నమార్గం ఇంటర్నెట్. ఆన్ లైన్ లో, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటాయి. ముఖ్యంగా కొత్తగా మార్కెట్లోకి వచ్చిన యూత్ వారి టార్గెట్ అవుతారు. అందుకే ఆన్ లైన్ సమాచారం ఎప్పుడూ కూడా రిటైల్ ఇన్వెస్టర్స్ కు శ్రేయస్కరం కాదు. అందుకే నిపుణుల సలహాలు అవసరం. మార్కెట్లో స్టాక్ ప్రైస్ హెచ్చు తగ్గులకు రకరకాల కారణాలుంటాయి. కంపెనీ ఆదాయం, ఆపరేషన్, ఆర్థిక ఫలితాలు, మేనేజ్ మెంట్, అసెట్స్, ఒప్పందాలు వంటివి కీలకం. ఇవన్నీ లెక్కగట్టి షేర్ కొనాలా వద్దా అనేది నిపుణులు మాత్రమే అంచనా వేసి ఖచ్చితంగా చెప్పగలరు. 

ప్రకటనలు చూసి మోసపోవడం
ఇంటర్నెట్, గూగుల్ లో ట్రెండింగ్ షేర్లు అని కొడితే వేలకొద్దీ వస్తాయి. ఇవన్నీ నిజంగా ట్రెండింగ్ ఉన్నాయా? లేక సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్- SEO మాయాజాలమా అన్నది చూసుకోవాలి. ఎందుకంటే కొన్ని కంపెనీలు తమ షేర్లు లావాదేవీలు పెంచుకోవడానికి ఇంటర్నెట్ ను వాడుకుంటాయి. బెస్ట్ షేర్ అంటే చాలు వాళ్ల వివరాలు గూగుల్ లో ముందుగా కనిపిస్తాయి. అయితే ఇందులో కొన్ని మంచి షేర్లు కూడా ఉండవచ్చు. కానీ మీరు నష్టపోకూడదంటే మాత్రం మీరు ఎంపిక చేసుకున్న షేర్ల గురించి ఖచ్చితంగా నిపుణుల అభిప్రాయాలు తీసుకోవాలి. ఇక మ్యూచువల్ ఫండ్, బ్రోకింగ్ కంపెనీల ఎంపికలోనూ జాగ్రత్తలు ఉండాలి. ఆయా కంపెనీలు చూపించే మార్కెటింగ్ మెటీరియల్ సరైందా కాదా? అన్నది తెలుసుకోవాలి. దీనిపై నిపుణుల అభిప్రాయం తీసుకోండి. 


కంపెనీల గురించి తెలియాలంటే...
మార్కెట్లో వందల కంపెనీలు లిస్టింగ్ అయ్యాయి. ఇందులో ఏది మంచి కంపెనీ.. మరెందులో పెడితే లాభనష్టాలు వస్తాయన్నది మనం అర్ధం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. కంపెనీ ప్రోఫైల్ కీలకం. దీనిపై సమగ్రమైన సమాచారం తెలుసుకోవాలంటే నిపుణుల సాయం కావాలి. ఇంటర్నెట్ లో ఉంటుంది..కానీ పూర్తి సమాచారం ఉండకపోవచ్చు. ఉన్నా.. అనుకూలంగా, లేదా ప్రతికూలంగా కనిపించవచ్చు. 

మార్కెట్ ఎనలిస్టుల చెప్పేవి....
మార్కెట్ ఎనలిస్టులు ట్రేడింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అంతేకాదు సలహాలు విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటారు. ఎనలిస్టులను వ్యక్తిగతంగా లేదా ఫోనులో సంప్రదించి మార్కెట్లో మనం డబ్బు ఎలా పెట్టాలి. ఫండ్ బెటరా? స్టాక్ మార్కెట్ మంచి చాయిస్ అన్దని చర్చించాలి. అప్పుడే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కంపెనీలు చేసే జిమ్మిక్కుల గురించి అడగాలి. మీకు ఇంకా డిటైల్ట్ గా కావాలంటే.. టీవీ5 బిజినెస్ హెడ్ వసంత్ కుమార్ అండ్ టీమ్ నిర్వహించే వెబినర్లు, లేదా టవీలో షోలను గమనించండి.. ముక్కుసూటిగా సలహాలు ఇస్తారు. జిమ్ముక్కుల చేసే కంపెనీల గురించి నిర్మోహమాటంగా ప్రస్తావిస్తారు.  తెలుగురాష్ట్రాల్లోని మార్కెట్ నిపుణులుగా ఉన్న ఈ టీమ్ అత్యుత్తమ విలువలతో ఎప్పుడూ ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తారు. స్టాక్ సలహాలు మాత్రమే కాదు.. టెక్నికల్ అంశాల కూడా చెబుతుంటారు. ఇక సెబీ వంటి ఈక్విటీ మార్కెట్ నియంత్రణ సంస్థల మార్గదర్శకాలు, నిబంధనలు వంటివి తెలుసుకోవడం కూడా అవసరమే. ఒక్కోసారి మార్కెట్లో చేసే చిన్నతప్పుల వల్ల పెద్ద నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తుంది. అందుకే వారిని ఫాలో అయితే మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది. 
షేర్లలో మన వద్ద ఉన్న ఎంతోకొంత సేవింగ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అజాగ్రత్తగా.. ఇంటర్నెట్ ను నమ్ముకుని పెడితే తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఒక్కోసారి నిపుణుల అంచనాలు కూడా తప్పుకావొచ్చు. షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ తగ్గొచ్చు. కానీ దీర్ఘకాలికంగా వాళ్లు ఇచ్చే సలహాలు ఇన్వెస్టర్లకు లబ్ధి చూకూర్చుతాయి. ఇంటర్నెట్ వాడొద్దని.. సమాచారం తెలుసుకోవద్దని కాదు.. కానీ నిపుణుల అనుభవాలు, వారి అభిప్రాయాలు మార్కెట్ లో మదుపుదారులకు కీలకం. వారు డెడికేటెడ్ గా మార్కెట్ పాలో అవుతుంటారు.. చదరంగం లాంటి మార్కెట్లో వారు చూపించే దారి ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది.