తొలిరోజే తుస్సుమన్న ఏంజెల్‌ బ్రోకింగ్‌..

తొలిరోజే తుస్సుమన్న ఏంజెల్‌ బ్రోకింగ్‌..

ఇవాళ 10శాతం డిస్కౌంట్‌తో స్టాక్‌ మార్కెట్లో లిస్టైన ఏంజెల్‌ బ్రోకింగ్‌ తీవ్ర ఒడిదుడుకుల మధ్య చివరకు లిస్ట్‌ ధరవద్దే ఇవాళ ట్రేడింగ్‌ను ముగించింది. ఇవాళ ఉదయం రూ.275 వద్ద బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో ట్రేడింగ్‌ ప్రారంభించిన ఏంజెల్‌ బ్రోకింగ్‌ ఆరంభంలోనే రూ.257కు పడిపోయింది. ఆ తరవ్ఆత కోలుకున్నట్టు కనిపించినా ఏ స్థాయిలోనూ ఇష్యూ ధర సమీపానికి రాలేకపోయింది. ఇష్యూ ధర రూ.306 కాగా, ఇవాళ ఇంట్రాడే హై రూ.296.45గా ఉంది. చివరకు 10 శాతం నష్టంతో రూ.275.85 వద్ద తొలిరోజూ ట్రేడింగ్‌ను ముగించింది. 

ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా ఆసక్తి లేకపోవడంతో ఏంజెల్‌ బ్రోకింగ్‌ పబ్లిక్‌ ఇష్యూకు ఆశించిన స్పందన రాలేదు. దీంతో ఇవాళ రిటైల్‌ ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపారు. తొలిరోజూ బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి వాల్యూమ్స్‌ 94.50 లక్షలుగా నమోదయ్యాయి. కంపెనీ మార్కెట్ క్యాప్‌ రూ.2289.14 కోట్లు, బుక్‌ వేల్యూ రూ.79.01గా ఉంది.