కెమ్‌కాన్‌ స్పెషాలిటీ, క్యామ్స్‌ బంపర్‌ లిస్టింగ్‌..

కెమ్‌కాన్‌ స్పెషాలిటీ, క్యామ్స్‌ బంపర్‌ లిస్టింగ్‌..

ఇవాళ 115శాతం ప్రీమియంతో కెమ్‌కాన్‌ స్పెషాలిటీ కెమికల్స్‌ లిస్టైంది. ఇష్యూ ధర రూ.340 కాగా, ఇవాళ బీఎస్‌ఈల్లో రూ.730.95 వద్ద స్టాక్‌ మార్కెట్లో కెమ్‌కాన్‌ స్పెషాలిటీ నమోదైంది. రెట్టింపు స్థాయికి పైగా ప్రీమియంతో లిస్టింగ్‌ అయి ఆ వెంటనే డే గరిష్ట స్థాయి రూ.743.80కు చేరింది. ఆ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ఒకదశలో రూ.592కు పడిపోయింది. ప్రస్తుతం 81శాతం ప్రీమియంతో రూ.616 వద్ద కెమ్‌కాన్‌ స్పెషాలిటీ ట్రేడవుతోంది.

అలాగే ఇవాళ లిస్టైన మరో కంపెనీ కంప్యూటర్‌ ఏజ్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌(క్యామ్స్‌) కూడా ఇన్వెస్టర్లను ఆనందంలో ముంచెత్తింది. ఇష్యూ ధర రూ.1230 కాగా ఇవాళ 22.39శాతం ప్రీమియంతో బీఎస్‌ఈలో రూ.1518 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభంఇంచింది. ఒక దశలో ఇష్యూ ధర సమీపానికి వస్తుందా అని ఇన్వెస్టర్లు ఆందోళన చెందినప్పటికీ... డే కనిష్ట స్థాయి రూ.1306.20 వద్ద మళ్ళీ బయ్యింగ్‌ లభించింది. ప్రస్తుతం 18శాతం పైగా ప్రీమియంతో రూ.1456 వద్ద ట్రేడవుతోంది. ఇవాళ ఇప్పటివరకు బీఎస్‌ఈలో 10,141,838 షేర్లు ట్రేడయ్యాయి. 

మొత్తం మీద ఇవాళ లిస్టైన రెండు కంపెనీలు ఇన్వెస్టర్లను ఆనందంలో ముంచెత్తాయి.