డిజిటల్ తెలంగాణ దిశలో మరో అడుగు

డిజిటల్ తెలంగాణ దిశలో మరో అడుగు

తెలంగాణ ప్రభుత్వం మరో నాలుగు సెక్టోరియల్ పాలసీలను ఆవిష్కరించింది.   కేటీఆర్ సమక్షంలో హైదరాబాద్  హెచ్‌ఐసీసీలో  ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ, డేటా ఎనలిటిక్స్, డేటా సెంటర్, ఓపెన్ డేటా పాలసీలను అమలులోక్లి తెస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.   ఐటీ రంగంలో భారీగా ఉపాధి అవకాశాలున్నాయని సేఫ్ అండ్ సెక్యూర్ సైబర్ స్పేస్‌ను ఐటీ కంపెనీలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పని చెయ్యాలని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఓపెన్ డేటా పాలసీ దేశానికే మార్గదర్శకంగా నిలువనుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సిస్కో, కంట్రోల్ ఎస్, నాస్కామ్ లతో పాటు మరో నాలుగు కంపెనీలు ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయిMost Popular