ఢిఫెన్స్ కంపెనీల కోసం చూస్తున్నారా.. అవాంటెల్ పై కన్నేసి ఉంచండి

ఢిఫెన్స్ కంపెనీల కోసం చూస్తున్నారా.. అవాంటెల్ పై కన్నేసి ఉంచండి

ఢిఫెన్స్ కంపెనీల కోసం చూస్తున్నారా.. అవాంటెల్ పై కన్నేసి ఉంచండి

డిఫెన్స్ రంగంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల పలు సంస్కరణలు ప్రతిపాదించింది. రక్షణ ఉత్పత్తుల దిగుమతులు తగ్గించడం, దేశీయ తయారీ రంగాన్ని పెంపొందించడం ఇందులో ముఖ్యమైన అంశాలు. దీని ప్రకారం సమీప భవిష్యత్తులో డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ -కమ్యూనికేషన్ల పరికరాలు, సేవలు అందించే దేశీయ కంపెనీలకు మంచి ఆర్డర్లు లభించే అవకాశం ఉన్నట్టు స్పష్టమవుతుంది. 
ఈ కోణంలో పరిశీలిస్తే.. శాటిలైట్ కమ్యూనికేషన్-వైర్ లెస్  సిస్టమ్ సేవలు- ఉత్పత్తుల కంపెనీ అయిన అవాంటెల్ లిమిటెడ్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. 
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ కంపెనీకి భారత నౌకాదళం, భారతీయ రైల్వే, ఇస్రో, కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు వినియోగదారులుగా ఉన్నాయి. టెక్నాలజీ పరంగా చూస్తే.. ఈ సంస్థ తయారుచేసే ఉత్పత్తులకు పోటీ తక్కువ. ఒకరకంగా చెప్పాలంటే ఇది నిష్ ఏరియాలో కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో మంచి ఆర్డర్లు సంపాదించి ఆదాయాలను, లాభాలను గణనీయంగా పెంచుకునే అవకాశం దీనికి ఉంది.

పెరిగిన బడ్జెట్
కేంద్రప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రక్షణ రంగానికి రూ.4.31లక్షల కోట్లు కేటాయించింది. క్రితం ఏడాదితో పోల్చితే ఈ కేటాయింపులు 9.37శాతం అధికం. అంతేగాక, దేశీయ రక్షణ తయారీ కార్యకలాపాలను పెంపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా దాదాపు 100 ఉత్పత్తుల దిగుమతులపై దశలవారీగా నిషేధాన్ని అమలు చేయనున్నట్టు కేంద్ర రక్షణ మంత్రి ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. దీని ప్రకారం అవాంటెల్ వంటి కంపెనీలకు భవిష్యత్తు భాగుంటుందనేది విస్నష్టం.

చైనా ఫ్యాక్టర్
పొరుగుదేశమైన చైనా ఇటీవల కాలంలో మనదేశంపై కత్తులు దూస్తున్న విషయం విదితమే. తూర్పు లడక్ ప్రాంతంలో వాస్తవాధీనరేఖ (LAC) ను దాటి భారత ఆజమాయిషీలో ఉన్న భూబాగంలోకి చైనా బలగాలు దూసుకవచ్చి తిష్టవేశాయి. ఈ దాడిని అడ్డుకోవడానికి భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున సైన్యాన్ని, సైనియ యంత్ర సామాగ్రినీ మోహరించింది. ఇదే సమయంలో సైన్యానికి అవసరమైన ఉపకరణాలు, ఆయుధాలు కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యవసరంగా ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధవిమానపాలు తెప్పించుకున్న విషయం తెలిసిందే. అదే విధంగా రష్యా నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసింది. అంతేగాక, ఏకే 53 రైఫిల్స్ తయారీ విషయంలో రష్యాతో కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త సంస్థకు ఆర్డర్లు ఖరారు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇలా ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న రక్షణ కాంట్రాక్టుల విషయంలో కదలిక వచ్చింది. ఈ క్రమంలో దేశీయ కంపెనీలకు కూడా ఆర్డర్లు విడుదల అవుతున్నాయి. 

రూ.96.76 కోట్ల కాంట్రాక్ట్
అవాంటెల్ లిమిటెడ్ కంపెనీకి ఈ ఏడాది ఆగస్టు 28న భారత నౌకాదళం నుంచి రూ.96.76 కోట్ల కొత్త కాంట్రాక్ట్ లభించింది. దీనిని ఏడాదిలోపే పూర్తిచేయాల్సి ఉంటుందని సమాచారం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ టర్నొవర్రూ.52 కోట్లు మాత్రమే. దీని ప్రకారం చూస్తే.. ఇది మంచి కాంట్రాక్ట్ కింద లెక్క. కనీసం రెండేళ్ల టర్నొవర్ తో సమానం. 
ఇదే కాకుండా ఈ కంపెనీకి మరో రూ.250 కోట్ల విలువైన కాంట్రాక్టులు లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే వచ్చే రెండు, మూడేళ్ల పాటు అధిక ఆదాయాలు, లాభాలు ఆర్జించగులుగుతుంది.

కంపెనీ ఆర్థిక ఫలితాలు
గడిచినరెండేళ్లలో  ఈ కంపెనీ స్థిరమైన ఆదాయాలు, లాభాలు నమోదుచేసింది. పెద్దగా హెచ్చుతగ్గులు లేవు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మాత్రం కంపెనీ ఆదాయాలు, లాభాలు ఆకర్షణీయంగా నమోదు కాలేదు. కోవిడ్ -19 ప్రభావం కొంతవరకూ దీనికి కారణం. కానీ మిగిలిన త్రైమాసికాల్లో పనితీరు మెరుగుపడే అవకాశం ఉంది. 

అవాంటెల్ ఆదాయాలు, లాభాలు తీరుతెన్నులు
-------------------------------------------------------------------
రూ. కోట్లలో     2018-19     2019-20       2020-21 ( Q1)
-----------------------------------------------------------------
ఆదాయం          50.51          51.91             11.13
నికరలాభం        12.50          13.01               1.76     
ఈపీఎస్ (రూ.)   23.65           26.53              3.57
----------------------------------------------------------------

 

 అవాంటెల్ మూలధనం వివరాలు

షేర్ ముఖ విలువ: రూ.10
షేర్ ధర రూ.395
మార్కెట్ క్యాప్ : రూ.160 కోట్లు
జారీ మూలధనం : రూ.4.05 కోట్లు ( 40,54,493 కోట్లు)
ప్రమోటర్ల వాటా : 40.87%

షేర్ ధర/ వాల్యుయేషన్

  • అవాంటెల్ లిమిటెడ్ షేర్ BSEలో మాత్రమే నమోదై ఉంది. గత ఏడాది కాలంలో ఇది రూ.478 గరిష్ట / రూ.140 కనిష్ట ధరలను నమోదు చేసింది.ప్రస్తుతం రూ.410 వద్ద కనిపిస్తోంది. ఈ కంపెనీ షేర్ ధర మార్కెట్ పతనంలో రూ.200 వరకూ రావడం, మళ్లీ కోలుకున్నప్పుడు రూ.500 వరకూ వెళ్లడం కనిపిస్తుంది. మార్చి-ఏప్రిల్ నెలల్లో నమోదు అయిన స్టాక్ మార్కెట్ పతనంలో ఈ షేర్ ధర బాగా పడిపోయింది. ఆ తర్వాత వేగంగా కోలుకుంది. ఇటీవల కంపెనీకి పెద్ద ఆర్డర్ రావడంతో షేర్ ధర ఆకర్షణీయంగా పెరిగింది.
  • కంపెనీ మార్కెట్ క్యాప్ ఇప్పుడు రూ.165 కోట్లుగా ఉంది. దాదాపు 15PE షేర్ ధర కనిపిస్తోంది.ఒక్కో షేర్ వాల్యూ రూ.127 ఉంది. క్రమం తప్పకుండా డివిడెండ్ చెల్లిస్తున్న కంపెనీ ఇది.
  • 2018 మే నెలలో ఈ షేర్ ధర రూ.600 వరకూ పెరిగింది. కానీ ఈ తర్వాత మార్కెట్లో కరెక్షన్ రావడం, కంపెనీకి ఆశించిన విధంగా ఆర్డర్లు లభించకపోవడంతో షేర్ ధర దిగివచ్చింది. మళ్లీ ఇప్పుడు పెరుగుతోంది.
  • సమీప భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆర్డర్లు లభించే అవకాశం కనిపిస్తున్నందున ఇప్పటికీ ఈ షేర్ ఇన్వెస్టర్లకు ఆకర్షణీయమే. కాకపోతే కొన్ని సవాళ్లున్నాయి. కంపెనీకి ఆర్డర్లు స్థిరంగా ఉండనందున ఒక ఏడాదిలో అధిక ఆదాయాలె, మరో ఏడాదిలో తక్కువ ఆదాయం నమోదు అవుతుంది. దీని వల్ల షేర్ ధర స్థిరంగా పెరిగే అవకాశం ఉండటం లేదు. ఈ సవాలను అధిగమించడంపై యాజమాన్యం ద్రుష్టి సారించినట్టు తెలుస్తోంది.
  • దేశీయ రక్షణ రంగంలో వస్తున్న మార్పులను పరిగణలోకి తీసుకుని ఈ విభాగంలోని కంపెనీలపై పెట్టుబడి పెట్టాలనే ఆసక్తి ఉన్న ఇన్వెస్టర్లు ఈ కంపెనీపై ఒక కన్నేసి ఉంచటం మంచిది.
  • స్టాక్ మార్కెట్ పతనం కాకుండా స్థిరంగా ఉండి, వచ్చే రెండు మూడు త్రైమాసికాల్లో మెరుగైన లాభాలు ప్రకటించిన పక్షంలో అవాంటెల్ షేర్ రూ.600 వరకూ పెరుగుతుంది. అలా కాకుండా వచ్చే నాలుగైదు నెలల పాటు స్టాక్ మార్కెట్ కరెక్షన్ జోన్లోకి వెళ్లిపోతే లేదా సైడ్ వేస్ లో ఉండిపోతే ఈ షేర్ ధర కిందకు రావొచ్చు.