న్యూ జనరేషన్ సొల్యూషన్స్ కంపెనీ.. క్యాప్ స్టన్ ఫెసిలిటీస్ మేనేజ్ మెంట్

న్యూ జనరేషన్ సొల్యూషన్స్ కంపెనీ.. క్యాప్ స్టన్ ఫెసిలిటీస్ మేనేజ్ మెంట్

ఇన్వెస్టర్లకు మరో ఇంట్రెస్టింగ్ కంపెనీ గురించి చెబుతున్నాం. ఇలాంటి సంస్థ మన హైదరాబాద్ లో ఉందని తెలిస్తే మీరు కూడా ఆశ్యర్యానికి గురి అవుతాయి. కంపెనీ పేరు క్యాప్ స్టన్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ లిమిటెడ్. ఇది ఫెసిలిటీస్ మేనేజ్ మెంట్ కంపెనీ. సెక్యూరిటీ సర్వీసెస్, స్టాఫింగ్ సొల్యూషన్స్ వంటి కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంది. అంటే ప్రైవేటు సెక్యూరిటీ,  బిజినెస్, నివాస భవనాల్లో హౌస్ కీపింగ్, క్లీనింగ్, మెయింటినెన్స్ సేవలు అందిస్తోంది. కాంట్రాక్ట్ పద్దతిలో వివిధ విభాగాలకు చెందిన కంపెనీల అవసరాలకు తగినట్టు ఉద్యోగులను సరఫరా చేయడమే క్యాప్ స్టన్ కార్యకలాపాలు. ఓ రకంగా ఇది న్యూ జనరేషన్ కంపెనీ ఇది. డెవలపింగ్ కంట్రీస్ లైక్ అమెరికా, యూరోప్ దేశాల్లో ఇటువంటి కంపెనీలు అధికంగా ఉంటాయి. మనదేశంలో ఇప్పడిప్పడే ఈ రంగంలో అవకాశాలను విస్తరిస్తున్నాయి. కంపెనీలు కూడడా అందిపుచ్చుకుంటున్నాయి. 

ఈ విభాగంలో దేశవ్యాప్తంగా అనేక కంపెనీలు ఉన్నప్పటికీ కూడా స్టాక్ ఎక్చేంజిలో నమోదైనవి మాత్రం చాలా తక్కువ. క్యాప్ స్టన్ తో పాటు టీమ్ లీజ్ సర్వీసెస్, SIS అనే సంస్ధలు మాత్రమే ఈక్విటీ మార్కెట్లో ఉన్నాయి. పూణె కేంద్రంగా పనిచేస్తున్న BVGఇండియా లిమిటెడ్ అనే కంపెనీ కొత్తగా IPOకు రాబోతుంది. ( క్వేస్ కార్ప్ అనే మరో కంపెనీ కూడా ఈ విభాగంలో ఉంది. అయితే ఈ కంపెనీకి ఐటీ సేవల వ్యాపారం కూడా ఉంది) ఇదే రంగానికి చెందిన క్యాప్ స్టన్ చిన్నదే అయినప్పటికీ కూడా దీనికి అనేక రకాల ఆకర్షణీయ అంశాలున్నాయి. గడిచిన నాలుగేళ్లుగా నిలకడగా 20-25శాతం మధ్య గ్రోత్ రేటు నమోదు చేస్తుంది. ఇది నిజంగా అత్యంత కీలక అంశం. సమీప భవిష్యత్తులో శరవేగంగా ఎదిగే అవకాశాలు కూడా కంపెనీకి ఉన్నాయి. మెరుగైన వార్షిక వ్రుద్ది రేటును నమోదు చేయడంతో పాటు.. మరింత ఉన్నతికి అవకాశాలున్నాయి. అంతేకాదు, మార్కెట్ క్యాప్  తక్కువగా ఉండటం కూడా ఇన్వెస్టర్ల పరంగా చూసినప్పుడు ప్రత్యేకంగా కనిపిస్తుంది. అంటే పెరగడానికి అవకాశం ఉందని అర్ధం. 

అడ్వాంటేజ్

ఒక మొక్కను చిన్నగా ఉన్నప్పుడు గుర్తించి దానితో అనుబంధం పెంచుకోవడం ముఖ్యం. అది మానై... విస్తరించిన తర్వాత అధిక వాల్యేషన్ తో మనకు పెట్టుబడితో పాటు.. లాభాలు కూడా పంచుతుంది. ఎక్కువ వాల్యేషన్ ఉన్నదానితో పెడితే దానిపై వచ్చే ప్రతిఫలం కూడా పరిమితమే. క్యాప్ స్టన్ విషయానికి వస్తే అది ఇప్పుడు చిన్న మొక్కగా ఉంది. భాగా విస్తరించడానికి అవకాశం ఉంది. అదే ఇన్వెస్లర్లకు అవకాశం.

మేనేజ్ మెంట్
ఈ కంపెనీని యంగ్ ప్రెన్యూర్ పదేళ్ల క్రితం హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించారు. చిన్నగా మొదలైన ప్రస్తానం ఇప్పుడు ఓ దశకు చేరింది. ఇక ఇక్కడి నుంచి ఎంతో వేగంగా వ్రుద్ధి ఉంటుందని అంచనా. ఈ కంపెనీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐజీగా పనిచేసి రిటైర్ అయిన ఓ ఉన్నతాధికారి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. కంపెనీలో నిర్వహణ విభాగాల్లో HODలుగా జాతీయ, అంతర్జాతీయ ఫెసిలీటీస్ మేనేజ్ మెంట్ సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉన్న ఉద్యోగులు ఇందులో ఉన్నారు.

కేపిటల్ డేటా

 • షేరు షేస్ వాల్యూ రూ.10
 • మార్కెట్ ధర రూ.108
 • జారీ చేసిన షేర్లు 1,01,44,061
 • ప్రమోటర్ల వాటా 72.86శాతం
 • సాధారణ వాటాదార్లు 27శాతం
 • సంస్థాగత ఇన్వెస్టర్లు 0.09శాతం
 • మొత్తం వాటాదార్ల సంఖ్య 173

కంపెనీ అందిస్తున్న సర్వీసులు

 • సెక్యూరిటీ సర్వీసులు
 • వాణిజ్య, నివాస భవనాల నిర్వహణ
 • మ్యాన్ పవర్ సర్వీసెస్
 • స్టాఫింగ్ సొల్యూషన్స్
 • ఉద్యోగుల సంఖ్య బ్యాక్ ఆఫీస్ 300 మంది
 • క్లెయింట్ సర్వీస్ ఎంప్లాయిస్ 14,000
 • స్టాఫింగ్ సొల్యూషన్స్ క్లయింట్స్ 10కి పైగానే ( తోషిబా, HCL,బిగ్ బాస్కెట్, TCS సహా పలు కంపెనీలు)

ఇతర ప్రత్యేకతలు
ఈ కంపెనీ రెండేళ్ల క్రితం NSE ఎమెర్జ్ పేరుతో ఉన్న NSE స్మాల్ ఎక్చెంజీలో నమోదైంది. ఈ తర్వాత ఈ ఏఢాది మే27న NSE మెయిన్ బోర్డులోకి వచ్చింది. ఏడాది, రెండేళ్లలో BSEలోనూ ఈ కంపెనీ షేర్లను లిస్ట్ చేసింది.
ఈ ఏడాది ఏప్రిల్-త్రైమాసికంలో కంపెనీ వ్యాపార కార్యకలాపాలపై కోవిడ్ 19 ప్రభావం పడింది. నెల, రెండు నెలలు పాటు ప్రధాన కార్యాలయంలో కార్యకలాపాలు ఏమాత్రం సాగలేదు. కానీ ఇప్పుడు మళ్లీ దాదాపు సాధారణ స్థితికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచి కార్యకలాపాలు బాగానే సాగుతున్నాయని కంపెనీ వర్గాల ద్వారా తెలుస్తోంది.


అంతేకాక కొత్త క్లయింట్ల రాక కూడా ఈ సారి బాగా పెరిగింది
ఈ రంగంలో ఇతర కంపెనీలతో పరిశీలిస్తే, వాటి నికర లాభాలు, టర్నొవర్లో 5శాతం కూడా ఉండటం లేదని స్పష్టమవుతుంది. కేవలం 2, 3శాతం లాభాలతో సరిపెట్టుకుంటున్న కంపెనీలున్నాయి. కానీ వీటికి భిన్నంగా క్యాప్ స్టన్ ఫెసిలిటీస్ మేనేజ్ మెంట్ బాటమ్ లైన్ 10శాతం వరకూ ఉండటం విశేషం.
కానీ, మార్కెట్ క్యాప్ పరంగా ఎంతో తక్కువ ఉన్న కంపెనీ ఇది.
గత నాలుగేళ్లలో ఆదాయాలు, లాభాల్లో ఏటా 20శాతం ప్లస్ గ్రెత్ ఉంది. క్రమం తప్పకుండా ఆదాయాలు, లాభాలు పెరుగుతున్న  కంపెనీలు ఇప్పటికిప్పుడు కాకపోయినా, భవిష్యత్తులో అయినా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు మంచి మద్దతనిస్తాయి. 
కొత్తగా ఎంతో ఆకర్షిణీయమైన స్టాఫింగ్ సొల్యూషన్స్ లోకి క్యాప్ స్టన్ అడుగుపెట్టింది. ఈ విభాగంలో ఇప్పటికే 10వరకు క్లయింట్లను సంపాదించడం గమనార్హం. ఇందులో ఐటీ కంపెనీలు, ఇంజీనిరింగ్, ఫార్మా తదితర రంగాలకు చెందిన కంపెనీలున్నాయి. స్టాఫింగ్ సోల్యూషన్స్ అంటే పెద్ద పెద్ద కంపెనీల్లో సిబ్బంది పనిచేస్తున్నారు.కానీ వారి ఎంప్లాయ్ మెంట్ రోల్స్ మాత్రం క్యాప్ స్టన్ లో ఉంటాయి. అంటే USలొ మన ఇంజినీర్లు చేసే కాంట్రాక్ట్ ఉద్యోగుల మాదిరిగా అన్నమాట. ఈ కల్చర్ నెమ్మదిగా మనదేశంలోనూ వచ్చేస్తుంది. కంపెనీ తమ సొంత HR రోల్స్ లో ఉద్యోగులను పెడితే వారికి జీతభత్యాలు, సదుపాయాలు అధికంగా ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో, లేదా సిబ్బందిని తొలగించడం కష్టమనే ఆలోచనతో కాంట్రాక్టు కంపెనీల ద్వారా అవసరమైన ఉద్యోగులను తీసుకుంటున్నాయి. భవిష్యత్తులో స్టాఫింగ్ సొల్యూషన్స్ కు భారీగా అవకాశాలున్నాయి. వేగంగా విస్తరించే రంగం. 
ప్రస్తుతం ఈ కంపెనీ ఆదాయాల్లో 50శాతం వరకూ హౌస్ కీపింగ్ సొల్యూషన్స్ నుంచి సమకూరుతోంది. 50శాతం సెక్యూరిటీ సొల్యూషన్స్ నుంచి వస్తుంది. వచ్చే రెండు, మూడేళ్లలో ఈ వ్యవపారం మిక్స్ మారిపోతుంది. హౌస్ కీపింగ్ సోల్యూషన్స్, సెక్యూరిటీ సొల్యూషన్స్ , స్టాఫింగ్ సొల్యూషన్స్ మూడు విభాగాలు సమయంగా 35శాతం చొప్పున ఆదాయాలు సంపాదించే అవకాశం ఉంది.మరొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. స్టాఫింగ్ సొల్యూషన్స్ వ్యాపారం ఎంతగా పెరిగితే కంపెనీకి అంతగా లాభం. 
కోవిడ్19 వల్ల ఖర్చులు తగ్గించుకునే ఉద్దేశంతో ఎన్నో కంపెనీలు హౌస్ కీపింగ్ సొల్యూషన్స్ అవుట్ సోర్స్ చేస్తున్నాయి. దీనివల్ల క్యాప్ స్టన్ కు కూడా కొత్త కాంట్రాక్టులు అధికంగా వచ్చే పరిస్థితి ఉంది.
 ఇవన్నీ చూస్తుంటే సమీప భవిష్యత్తులో మంచి కంపెనీగా ఇన్వెస్టర్లకు సంపద స్రుష్టిస్తుందని అర్ధమవుతుంది.

ఇతర కంపెనీలతో పోల్చితే..
హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, స్టాఫింగ్ సేవల్లో నిమగ్నమైన కంపెనీలు రెండు స్టాక్ ఎక్చేంజిలో లిస్ట్ అయ్యాయి. అవి టీమ్ లీజ్ సర్వీసెస్, సెక్యూరిటీస్ అండ్ ఇంటిలీజెన్స్ సర్వీసెస్ లిమిటెడ్  ఉన్నాయి. ఈ కంపెనీల వార్షిక ఆదాయాలు ఎంతో అధికం. కానీ లాభాలు మాత్రం టర్నొవర్ లో 5శాతం తక్కువగా కనిపిస్తున్నాయి. కానీ అదే సమయంలో మార్కెట్ క్యాపిటైలైజేషన్ లో మాత్రం ఎంతో అధికంగా ఉంది. 
ఈ కింద డేటా ఒక్కసారి పరిశీలిస్తే...

టీమ్ లీజ్ సర్వీసెస్ ధర ప్రస్తుతం 2374 వద్ద ఉంది. మార్కెట్ క్యాప్ 4060 కోట్లు కాగా, వార్షికఆదాయం 4783 కోట్లుగా ఉంది. నికరలాభం 42 కోట్లు. ఇక SIS స్టాక్ ధర 382. కంపెనీ మార్కెట్ క్యాప్ 5608 కోట్లు కాగా, వార్షిక ఆదాయం 2995 కోట్లు. నికర లాభం 86 కోట్లు. బీవీజీ ఇండియా లిమిటెడ్  వార్షిక ఆదాయం 1933 కోట్లు కాగా, నెట్ ప్రాఫిట్ 118 కోట్లు. ఇది ఇంకా షేర్ మార్కెట్లో లిస్ట్ కాలేదు. క్యాప్ స్టన్ మార్కెట్ ప్రైస్ 108 కాగా, వాల్యూ 109 కోట్లు. వార్షిక ఆదాయం 213 కోట్లు, నెట్ ప్రాఫిట్ 10 కోట్లు. పైన చెప్పిన వివరాలు అన్నీ కూడా 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబందించిన సమాచారం. 

బీవీజీ ఇండియా IPO
ఫెపిలిటీస్ మేనేజ్ మెంట్ సేవల్లో నిమగ్నమైన మరో కంపెనీ అయిన బీవీజీ ఇండియా కూడా త్వరలో IPOకు రానుంది. ఈ కంపెనీ ఇండియన్ రైల్వేస్, రాష్ట్రపతిభవన్, టాటా గ్రూప్, హిందుస్తాన్ లీవర్ వంటి పెద్ద క్లయింట్లకు సేవలు అందిస్తోంది. పూణె కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీ ప్రధానంగా ముంబై, న్యూ ఢిల్లీ నగరాల్లో సర్వీసులు అందిస్తుంది. బీవీజీ ఇండియాలో యూకే ప్రైవేటు ఈక్విటీ సంస్థ అయిన 3I కొంతకాలం క్రితం 27శాతం వాటాను రూ.1100 కోట్లకు తీసుకుంది. ప్రస్తుతం IPOలో రూ.1300 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. 3ఐ గ్రూపునకు ఎగ్జిట్ ఇవ్వడం, అప్పులు తీర్చివేయడం లక్ష్యంగా పెట్టుకుంది సంస్థ. దీని ప్రకారం చూస్తే కంపెనీ ఇష్యూ కంటే ముందే రూ.4వేల కోట్లకు పైగా సంస్థాగత విలువ కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయిన తర్వాత షేర్ ధర పెరిగిన పక్షంలో మరింత పెరుగుతుంది. 

క్యాప్ స్టన్ ఫేర్ ధర, వాల్యుయేషన్

ఈ రంగంలో ఇతర కంపెనీలతో పోల్చితే క్యాప్ స్టన్ షేర్  ధర ఎంతో తక్కువగానే ఉంది. అందువల్ల రెండు, మూడేళ్ల కాలానికి పెట్టుబడి పెట్టదలిస్తే ఇది ఆకర్షణీయమైన కంపెనీయే. ప్రస్తుతం రూ.108 వద్ద ట్రేడ్ అవుతోంది. కాకపోతే NSEలోనే ఉండటం, ట్రేడింగ్ వాల్యూమ్ తక్కువగా ఉండటం వల్ల అవరోధాలున్నాయి. ఈ కంపెనీ గురించి తెలిసినవారు కూడా తక్కువే. అందువల్ల ఈ షేర్ తక్కువ ధరలో ట్రేడ్ అవుతోంది. ఈ కంపెనీ గత పదేళ్ల కాలంలో తగిన శక్తియుక్తులను సమకూర్చుకుని ఇక నుంచి వేగంగా గ్రోత్ చూపించనుంది. వ్యాపార కార్యకలాపాలను కూడా బెంగళూరు, పూణె, ముంబై వంటి నగరాలకు విస్తరించనుంది. ఆకాశమే హద్దుగా వ్యపార అవకాశం ఉంది. దీని ప్రకారం చూస్తే సమీప భవిష్యత్తులో దీనికి ఈ ఆదాయాల్లో, లాభాల్లో మెరుగైన గ్రోత్ ఉంటుంది. అందువల్ల షేర్ ధర కూడా రెండు, మూడింతలు పెరగాలి. కంపెనీ మార్కెట్ కేపిటలైజేషన్ వాల్యూ ప్రస్తుతం రూ.109 కోట్లు మాత్రమే. వచ్చే రెండేళ్లలో రెట్టింపు అవుతుందని, దీంతో సహజంగానే మార్కెట్ విలువ రెండు, మూడు రెట్లు పెరుగుతుంది. దీనికి తోడు తోడు బీవీజీ ఇండియా పబ్లిక్ ఇష్యూను కూడా ఓ ట్రిగ్గర్ గా బావించవచ్చు. స్టాక్ మార్కెట్లో బీవీజీ ఇండియా IPO సక్సస్  అయితే దీనికి కూడా మంచి విలువ లభించే ఛాన్స్ ఉంది. టీమ్ లీజ్, SIS వంటి కంపెనీల వైపు చూసే పరిస్థితి వస్తుంది. ఈ సమయంలో తక్కువ వాల్యూ ఉన్న క్యాప్ స్టన్ షేరుపై మార్కెట్లో ఒక్కసారిగా ఆకర్షణ ఏర్పడవచ్చు. అదే జరిగితే ఈ షేర్ రూ.200 వరకూ వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.