ITD సిమెంటేషన్‌లో 4 రోజుల ర్యాలీకి బ్రేక్‌

ITD సిమెంటేషన్‌లో 4 రోజుల ర్యాలీకి బ్రేక్‌

తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరాశపర్చడంతో 4 రోజుల వరుస ర్యాలీకి ఇవాళ బ్రేక్‌ పడింది. ఇవాళ ఇంట్రాడేలో షేర్‌ 6శాతం నష్టపోయి రూ.52.2కు పడిపోయింది. ప్రస్తుతం 4.59 శాతం నష్టంతో రూ.53.05 వద్ద షేర్‌ ట్రేడవుతోంది. ఇవాళ బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో ఇప్పటివరకు 9.60 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.911.33గా ఉంది. ఇండస్ట్రీ పీ/ఈ 16.72 కాగా, కంపెనీ పీ/ఈ 21.12గా ఉంది. బుక్‌ వేల్యూ రూ.61.27, ఈపీఎస్‌ రూ.2.51గా ఉన్నాయి.

జూన్‌ 30తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఐటీడీ సిమెంటేషన్‌ మొత్తం ఆదాయం 43.3 శాతం క్షీణతతో రూ.399.4 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో రూ.16.7 కోట్లుగా ఉన్న నికరలాభం, ఈ ఆర్థిక సంవత్సరం క్యూ-1లో రూ.17 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఎబిటా 60.3శాతం క్షీణించి రూ.29.6 కోట్లకు పడిపోయింది. ఎబిటా మార్జిన్‌ 10.6 శాతం నుంచి 7.4 శాతానికి పరిమితమైంది.