జోరుమీదున్న ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌

జోరుమీదున్న ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌

నిఫ్టీ-500 ఇండెక్స్‌లో ఔట్‌పెర్ఫామ్‌ చేస్తోంది ఇండో స్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌. ఇవాళ ఇంట్రాడేలో ఈ స్టాక్‌ 10.6శాతం లాభపడి రూ.287.7కు చేరింది. గత 3వారాల్లో ఈ స్టాక్‌లో సింగిల్‌డేలో అతిపెద్ద ర్యాలీ రావడం ఇదే తొలిసారి. గత 5 ట్రేడింగ్‌ సెషన్స్‌లో ఈ కంపెనీకి 4 సెషన్స్‌లో కొనుగోళ్ళ మద్దతు లభించింది. ప్రస్తుతం 10 శాతం లాభంతో రూ.286.40 వద్ద షేర్‌ ట్రేడవుతోంది. 

20 రోజుల సగటుతో పోలిస్తే వాల్యూమ్స్‌ దాదాపు రెట్టింపయ్యాయి. 50, 100 రోజుల సగటు కదలిక స్థాయిలు రూ.265, రూ.271ను ఇవాళ ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌ బ్రేక్‌ చేసింది. గత ఏడాది డిసెంబర్‌ 10న 52వారాల కనిష్ట స్థాయి రూ.166కు పడిపోయిన ఈ స్టాక్‌ ప్రస్తుతం ఆ స్థాయికి 72శాతం ఎగువన ట్రేడవుతోంది. అలాగే ఈ ఏడాది ఆగస్ట్‌ 26న నమోదైన 52 వారాల గరిష్ట స్థాయి రూ.331కు ప్రస్తుతం 13శాతం దిగువన కొనసాగుతోంది.