టాప్‌గేర్‌లో ఆటో ఇండెక్స్‌

టాప్‌గేర్‌లో ఆటో ఇండెక్స్‌

ఫెస్టివల్‌ సీజన్‌ ముందుండటం, కొత్త మోడళ్ళను మార్కెట్లోకి విడుదల చేస్తుండటంతో ఇవాళ ఆటో ఇండెక్స్‌ టాప్‌గేర్‌లో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ ఇండెక్స్‌ 1.74శాతం లాభంతో ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌ను మహీంద్రా అండ్‌ మహీంద్రా, బజాజ్‌ ఆటో, టాటా మోటార్స్‌, మదర్సన్‌ సుమీ, టీవీఎస్‌ మోటార్స్‌లు లీడ్‌ చేస్తున్నాయి. అయితే అమరరాజా బ్యాటరీస్‌, బాష్‌లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతోన్నాయి.