వరుసగా మూడోరోజూ కావేరీ సీడ్‌ జోరు..

వరుసగా మూడోరోజూ కావేరీ సీడ్‌ జోరు..

ట్రేడింగ్‌ వాల్యూమ్స్‌ భారీగా పెరగడంతో వరుసగా మూడోరోజూ కావేరీ సీడ్స్‌కు కొనుగోళ్ళ మద్దతు లభిస్తోంది. దీంతో నిఫ్టీ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లో ఈ స్టాక్‌ ఔట్‌పెర్ఫమ్‌ చేస్తూ టాప్‌ గెయినర్‌గా ఉంది. ఇంట్రాడేలో ఈ షేర్‌ 6శాతం లాభపడి డే గరిష్ట స్థాయి రూ.583కు చేరింది. గత నెలరోజుల్లో సింగిల్‌ డేలో ఈ స్టాక్‌లో ఇంత ర్యాలీ రావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం 5.71 శాతం లాభంతో రూ.579.60 వద్ద ఈ స్టాక్‌ ట్రేడవుతోంది. 

స్మాల్‌ క్యాప్‌ కౌంటర్‌కి డిమాండ్‌ పెరగడంతో గత మూడు రోజుల్లో ఈ స్టాక్‌ 11 శాతం లాభపడి ఇన్వెస్టర్లను ఆనందంలో ముంచెత్తుతోంది. గత 2నెల్లలో వరుసగా ఇన్ని రోజులు లాభపడటం ఇదే తొలిసారి. ఇక వాల్యూమ్స్‌ కూడా ఇవాళ మెరుగ్గా ఉన్నాయి. 20 రోజుల సగటుతో పోలిస్తే వాల్యూమ్స్‌ దాదాపు రెట్టింపయ్యాయి. కంపెనీ షేర్‌ ప్రస్తుతం 50 రోజుల సగటు కదలిక స్థాయి రూ.594.3కు సమీపంలో ట్రేడవుతోంది. 

ఇక ఈ స్టాక్‌ ఈ ఏడాది మార్చి 24న 52 వారాల కనిష్ట స్థాయి రూ.273.7కు పడిపోయింది. గత నెల 7న ఈ స్టాక్‌ 52 వారాల గరిష్టం రూ.682.5కు చేరింది. ఆ తర్వాత కొంత కరెక్షన్‌ రాగా, గత 3 రోజుల్లో ఈ స్టాక్‌ మళ్ళీ జోరుమీదుంది. ప్రస్తుతం ఈ స్టాక్‌ 52వారాల కనిష్టానికి రెట్టింపు స్థాయి ఎగువన, 52వారాల గరిష్టానికి 14.5 శాతం దిగువన ట్రేడవుతోంది.